మా బాస్ అంటే నాకు ఎంతో గౌరవం ..కాదు కాదు
హీరో వర్షిప్ ..
డిపార్ట్మెంట్ లో సాదారణమయిన పేరున్న వ్యక్తే
గాని ..
ఇంటి విషయాలలో మాత్రం హీరో. బార్యకి బయపడటం కానీ, ఏవిషయమయినా సంకోచం లేకుండా ఫోన్ లో చెప్పటం కానీ అబ్బో
ఆ దైర్యం చెప్పేది కాదు.
పైగా లంచ్ అవర్లో నాలాటి కొత్త బర్త లకి సలహాలు
ఇస్తుంటాడు. పెళ్లాన్ని ఎలా చెప్పు చేతల్లో పెట్టుకోవాలో సూచనలు చేస్తుంటాడు. అందుకే
ఆయన నాకు హీరో ..
అలాటి మా హీరో గారు వాళ్ళ పెళ్లి రోజుని మా
దంపతులని బోజనానికి పిలిచాడు.
సంధ్య కి ప్రాక్టికల్ గా బార్య అంటే ఎలా ఉండాలో
చూపించే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషం వేసింది.
సంధ్య కి నేనంటే ప్రాణం. కానీ తన వాదనని నిర్మొహమాటంగా
చెబుతుంది. అభిప్రాయాలని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పటం మా సంద్య కి అలవాటు. ఒక్కోసారి
అవి నొచ్చు కునే వరకు వెళ్తాయి. ఒకటి రెండు రోజులు మాట్లాడు కోము. మళ్ళీ తానే పలకరిస్తుంది.
బ్రతిమాలుతుంది. దెబ్బలాడుతుంది. బండి పట్టాలు ఎక్కిస్తుంది.
అందుకే నాకు వచ్చిన ఈ ఛాన్స్ వదులుకోవటం ఎంత
మాత్రం ఇష్టం లేదు.
మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు మా బాస్. “ఇతను
హరినాధ్ అని మా ఆఫీసులో నా బెస్ట్ జూనియర్” నన్ను మాడమ్ గారికి పరిచయం చేశాడు.
“చాలా సార్లు చెబుతుంటారు. మీ శ్రీమతి పేరు
సంధ్య కదూ?” అంది పలకరింపుగా
హల్లో టీవి చూస్తూ పిచ్చాపాటి తో సోఫా లో మేము. బెడ్ రూమ్ లో వార్డ్ రోబ్ వివరాలతో ఆడాళ్ళు కొంత సేపు గడిపాక మా బాస్
“ఎమోవ్ .. మమ్మల్ని పట్టించుకునేది
ఏమయినా ఉందా లేదా??” గట్టిగా అరిచాడు.
పరాయి కుటుంబం ముందు బార్యని పెద్దగా కేక
వేసి పిలవటం .. అబ్బో .. అబ్బో మా బాస్ కె చెల్లింది.
“వస్తున్నానండీ” అందావిడ వినయంగా. నేను చూస్తున్నావా
అని సంధ్య ని కళ్ళతో ప్రశ్నించాను? ఆమె మాములుగానే ఉంది.
“ఇక బోజనం చేద్దామా??” అంటూ అందర్నీ పిలిచారావిడ.
డైనింగ్ టేబుల్ వద్ద మా బాస్ విజ్రభించాడు.
ఒకటే జోకులు. కొన్ని మాడం గారిని ఉద్దేశించినా ఆమె నవ్వుతూనే ఉంది.
పది లోపే సెలవు తీసుకుని ఇంటికి బయలు దేరాం.
దారిలో ఉపోద్ఘాతం గా “ మాడం గారు మా బాస్
కి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది?” అన్నాను నేను.
సంద్య నవ్వింది. బాస్ ఇంట్లో నా కళ్ల ప్రశ్న
అప్పుడు అర్ధమయి ఉంటుంది.
“మై డియర్ నాద్. మీ కవి హృదయం నా కిప్పుడు
అర్ధం అయింది.. కొట్టుకోని లేదా ,, తిట్టుకొని కనీసం
అలక చూడని దంపతులు ఉండరు. ఇవన్నీ సహజం సంభందాలు తేగెంత వరకు తెచ్చుకొక పోవటం మే వివేకం.
నా మొగుడు నాకు నచ్చేలా ఉంటే బాగుండు అని కోరు కోవటం తప్పేం లేదు. అలాగే మీరు కూడా.
ఈ పరిణామం లో కొంత చిన్న గాప్ లు ఉంటాయి వీలయినంతవరకు వాటిని నిద్ర చేయనీయకుండా తరిమేస్తే
మంచిది.” సంధ్య మాటల్లో మళ్ళీ అదే ముక్కుసూటి
తనం.
ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి పడుకునే ముందు “
అన్నట్టు నాధ్ మీ మాడం గారు మీ బాస్ మాటలు నచ్చనప్పుడల్లా డైనింగ్ టేబుల్ కింద నుండి కాళ్లతో
ఎన్ని సార్లు బ్రేకులు అదే సరయిన బాషలో చెప్పాలంటే తన్నులు వేసిందో మీరు గమనించారా?”
“పోలికలు వద్దు. ఎవరివి వాళ్లకుంటాయి. మనం
ఇవాళ బాగున్నాం. రేపు ఇంకా బాగుంటాం. “ అంది
సమ్మోహనం గా నవ్వుతూ ..
No comments:
Post a Comment