రంగారాయుడు
చెరువు కట్ట మీద పక్కనే ఉన్న బెంచి మీద కూర్చుని ఉన్నప్పుడు వాకింగ్ చేస్తూ 'కనకం' కనబడింది.
"నీ ఫోన్ నెంబరు మారి నట్లుంది.కలవటం లేదు" అడిగాను నేను.
తను నవ్వింది.
నెంబరు ఇస్తాను
నాతొ పాటు నడువు" అంది.
"వా యెస్" కిలోమీటరు ఉన్న ఒక రౌండ్ నడిచే సరికి చమటలు, రొప్పు...
"నెంబరు చెప్పు"
"ఎనిమిది"
అదేంటి ? మొత్తం చెప్పు.
"ఓక్కో చుట్టుకి ఒక్కో నెంబరు."
ఛీ ..
అయిదు నెంబర్లు
చెప్పించుకునే సరికి నాలుక పిడచ గట్టింది."ఇంకా నా వల్ల కాదు"
కూర్చోబెట్టి
నిమ్మకాయ సోడా ఇప్పించింది.
"మిగిలినవి రేపు" గాలి తీసుకుంటూ చెప్పాను.
"అయితే మొదటినుండి" అంది
..చి ఛీ .
ఆడాళ్ళది జాలి
గుండె అనే వాళ్ళు నాకోసారి కనిపించండి.ఇప్పుడొద్దు.అలత గా ఉంది మరో సారి.
సెల్ లో లౌడ్
స్పీకర్ లో 'జయమ్ము నిశ్చయంబు రా' పాట పెట్టుకుని మిగిలిన అయిదు రౌండ్
లు లూ పూ ర్తి ..చే....శా !!!.
***
సాయంత్రం
తీరిగ్గా ఫోన్ చేశా.
"హలో కనకం"
" సారి .. రాంగ్ నెంబరు.ఇది మోడరన్ జిమ్.అండ్ ఫిట్నెస్ సెంటర్ "
పోను కట్ చేశా.
***
చి చి ఛీ
No comments:
Post a Comment