Sunday, 26 June 2016

తల నొప్పి

“ఈ మధ్య తలనొప్పి గా ఉంటుందండీ” 
ఆప్తమాలజిస్ట్ ని కలిశాడు తిరుమల్ ప్రసాద్.
**
అన్నీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో పరీక్షలు నిర్వహించాక 
ఒక కళ్ల జోడు సిఫార్సు చేశాడు డాక్టర్.
**
ఐ డ్రాప్స్ కొనుక్కుని కళ్ళజోడు చేయించుకుని
మళ్ళీ డాక్టర్ ని కలిశాడు తిరుమల్.
**
“ఈ డ్రాప్స్ కంట్లో రోజు మూడుసార్లు తగ్గకుండా
రెండు రెండు చుక్కలు వేసుకోండి.
కళ్ళజోడు శని ఆదివారాలు మాత్రమే వాడండి”
**
“అదేంటి సార్ శని ఆది వారాలెనా? మిగిలిన రోజులు ?”
ఆశ్చర్యపోయాడు Thirumal Prasad
**
“మీది సాఫ్ట్ వేర్ ప్రొఫెషనేగా? శని, ఆదివారాలేగా ఇంట్లో ఉండేది?”
**

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...