Sunday, 26 June 2016

మిత్రులకి ఒక విన్నపం _/[]\_

శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయ కమిటీ, ఒంగోలు వారి విజ్ణప్తి :
******************************************************************** 
మా వీది మొదట్లో నిర్మాణం పూర్తయి ప్రతిష్టకి సిద్దంగా ఉన్న శ్రీ అభయంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, ద్వజ స్థంభ ప్రతిష్ట కార్యక్రమాలు ఆగస్టు 8,9,10 తేదీల్లో జరగనున్నాయి. 11 ఏండ్ల క్రితం ప్రారంభమయి అనేక కారణాలు వల్ల నిర్మాణం ఆగిపోయిన ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేయటానికి కొద్ది మందిమి సిద్దపడ్డాం. 2010 లో ఈ ప్రాంతానికి వచ్చి ఇండ్లు కట్టుకుని స్థిరపడ్డ నేను, నాలాగే ఈ ప్రాంతం లో స్థిరపడ్డ కొద్ది మంది మిత్రులు, శ్రీVenkateswarlu Sakhamuri మాస్టారు, Alahari Srinivas (గ్రనైట్ కంపెనీ ఉద్యోగి) మరీ ముఖ్యంగా చిన్నవాడయినా ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకుని తన సర్వ శక్తులు ధారపోస్తున్నObula Reddy Gosula మాస్టారు (స్థానిక సాయిబాబా ఛారిటీ స్కూల్, హెడ్ మాస్టర్) మరికొందరు మా వీధి లోని మిత్రులు స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్ లలో ఉంటున్న వారు, డాక్టర్ చంద్రశేఖర్ దంపతులు, స్థిరాస్థి వ్యాపారులు, శిద్దా కుటుంబీకులు, Phani Marella మిత్రులు. మరియు అనేక మంది దాతల సహాయం తో సుమారుగా ఇప్పటికీ 25 లక్షల రూపాయలు వెచ్చించి ఈ స్థితికి తీసుకు వచ్చాం. 
జమ అయిన ప్రతి పైసా ని బాంకు అకౌంట్ ద్వారా, కమిటీ లో చర్చించి జాగర్తగా ఖర్చు పెట్టటం, విరాళాలు సేకరించడం లాటివి ఇప్పటి వరకు జరుగుతున్నాయి. 
ఇప్పుడు ప్రధానమయిన ఘట్టం లోకి అడుగెట్టాం. <<< ప్రధాన ప్రతిష్టా కార్యక్రమం>>> ద్వజస్తంభ ఇత్తడి తొడుగు, అన్నదానం (సుమారు 5000 మంది అని అనుకుంటున్నాము.), స్థపతి ఖర్చులు, లాటి అనేక ఆగమ శాస్త్ర సంప్రదాయాలతో కార్యక్రమం పూర్తి చేయటానికి మొత్తం సుమారు గా రూపాయలు పది లక్షలుదాటతాయి. 



రియల్ ఎస్టేట్ మాంద్యం, సరయిన పంటలు లేకపోవటం, వ్యాపారాలు ఆశించినంత గా లేక పోవటం మా వనరులని దెబ్బతీస్తున్నాయి, ప్రమాదకరమయిన ఆర్ధిక స్థితి లో ఉన్నాం. ముగ్గురు మిత్రులం ఒక్కకరిమి లక్షకు పైగా వెచ్చించి, మూల విరాట్టు యంత్రాలు లాటివి తయారీకి పూనుకున్నాం. 40 రోజుల దీక్షా, పూజా కార్యక్రమాలు లాటి సంప్రదాయాలతో భారీగా అవసరాలు ఉన్న ఈ కార్యక్రమం నిర్వహణకు మాకు అనేక అవాంతరాలు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ట లో ఇటువంటి పరీక్షలు మామూలే అని ఓదార్చిన పెద్దల మాటలతో, మొండి దైర్యం తో ముందుకు పోతున్నాం. మా ఇళ్ళలో శుభ కార్యక్రమాలు కూడా ప్రతిష్ట పూర్తి అయిన తర్వాతే చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. 
ప్రస్తుతం మా పని గాలిలో దీపం లాగా ఉంది. విరాళాలు వ్రాసిన లేదా హామీ ఇచ్చిన వారు తప్పుకోవటం లేదా ముందుగా చెప్పిన స్థాయి లో ముందుకు రాకపోవటం , మాకు ఇబ్బందిగా ఉంది. అన్నదానం మొత్తం ఏర్పాటు చేస్తానన్న ఒక దాత పరిస్థితుల కారణంగా అయిదంకెల చిన్న మొత్తం తో వెనక్కి తగ్గారు. ఇప్పుడు మా పరిస్తితి మరి ఆగమ్య గోచరంగా ఉంది. 
మిత్రులు అందరూ వారి వారి వెసలు బాటు కొంది ఈ కరపత్రం లోని బాంకు ఆకవుంటుకు ఎంతో కొంత విరాళం పంపవలసినదిగా ప్రార్ధిస్తున్నాను. గత సంవత్సరం ఇలాటి ఆపద కాలం లో ఎఫ్‌బి మిత్రులు లక్షకు పైగా సాయం అందించారు . ఆలయ శిఖర నిర్మాణం లో ఎంతో అవసరాన్ని ఆదుకున్నారు. ఈ సారి కూడా మీ అందరికీ వేడుకుంటున్నాను. మిత్రులు వారి వాల్ మీద ఈ అబ్యర్ధన షేర్ చెయ్యటం ద్వారా మీ మిత్రుల మిత్రుల కి ఇది చేరుతుందని ఆశిస్తాను. మీరు పంపే ప్రతి 100 రూపాయల విరాళం కూడా విలువయినదే అని తెలియ చేస్తున్నాను. నగదు బదిలీ చేసిన మిత్రుల వివరాలు నాకు తెలియచేస్తే మాకు అకౌంట్ నిర్వహించడం సౌకర్యంగా ఉంటుంది.
విరాళాలు అందచేయవలసిన ఖాతా నెంబరు 5212101000387, కెనరా బాంకు, M.M.రోడ్డు, ఒంగోలు (ICFS code CNRB0005212) payee name శ్రే అభయాంజనేయ స్వామి వారి దేవస్థాన కమిటీ
------------------------------ అనేక ధన్యవాదాలతో, మీ శ్రీనివాసరావు సుంకర.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...