Saturday, 25 June 2016

సూర్య గ్రహణం

Manager Director to Project Director :
  • నేడు 11 గంటల కి సూర్య గ్రహణం ఏర్పడనుంది. సూర్యుడు రెండు నిమిషాలు పాటు చంద్రుని  వెనుక అదృశ్యమవుతాడు. ఇది ఆకాశం లో  అరుదుగా కనిపించే దృశ్యం.  ఉద్యోగులు కారు పార్కింగ్ ఏరియా  లో సూర్య గ్రహణం వీక్షించడానికి పావుగంట సేపు అనుమతింపబడ్డారు. సరిగ్గా 10-50 కి స్టాఫ్ అంతా పార్కింగ్ ఏరియా లో గేదర్ అయితే నేను సూర్యగ్రహణం గురించిన  చిన్న పరిచయం చేస్తాను. అందుబాటు ధరలో సేఫ్టీ అద్దాలు ధరలో సరఫరా చేయబడతాయి.


Project Director to Executive officer:
  • నేడు 10-50 కి ఉద్యోగులు అందరూ కార్ పార్కింగ్ స్థలం వద్దకి చేరండి. తదుపరి రెండు నిమిషాల పాటు సంపూర్ణ సూర్య గ్రహణం ఉంటుంది. సూర్యుడు కనిపించడు. ఒక మోస్తరు ధర  లో రక్షణ కోసం కళ్ళద్దాలు అందచేయబడతాయి. మేనేజింగ్  డైరెక్టర్ గారు గ్రహణం నేపద్యం గురించి చిన్న ప్రసంగాన్ని ఇస్తారు. గ్రహణం అంటే ప్రతి రోజు ఉండేది కాదు.


Executive Officer to Dy.Execitive officer :
  • మేనేజింగ్  డైరెక్టర్ నేడు సూర్య గ్రహణం లో రెండు నిమిషాలు పాటు సూర్యుడు  అదృశ్యం అవటం గురించి ఒక చిన్న ప్రసంగాన్ని ఇస్తారు. కనుక సిబ్బంది పదకొండు కి పది నిమిషాల ముందు కార్ పార్కింగ్ వద్ద గుమి గూడగలరు. ప్రతి రోజు మీరు దీనిని చూడటం కుదరదు. కొంత ధర చెల్లిస్తే మీరు సురక్షంగా ఉడటానికి వీలవుతుంది.


Dy Executive officer to Assistant officer  :
  • పావు తక్కువ పదికి ఉద్యోగులు అందరూ కార్ పార్కింగ్ వద్ద గుమి గూడతారు. అక్కడ మేనేజింగ్  డైరెక్టర్ రెండు నిమిషాలు పాటు సూర్యుడి ని కనిపించ కుండా చేస్తారు. ఇది రోజు జరిగేది కాదు. ఇది సురక్షితమే గాని కొంత ఖర్చు తో కూడిన పని.

Assistant officer to Sub-Staff :
  • మేనేజింగ్  డైరెక్టర్ అదృశ్యం కావటాన్ని  చూడటానికి నేడు కొందరు ఉద్యోగస్తులు కారు పార్క్ ఏరియాకి  వెళతారు. విషాదం ఏమిటంటే ఇది రోజు జరగదు.
  • J


J

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...