దారిలో నేను జారీ పడేటప్పుడు అతను చేతిని అందించాడు.
నా
మార్గం చీకటయినప్పుడు అతడు వెలుగు నిచ్చాడు
వయసు
పక్కన పెట్టి నాతో పాటు ఆడాడు.
నన్ను
సైకిల్ తొక్కించడానికి చమటలు కక్కెలా పరిగెట్టాడు.
నా
కాళ్ళకి రాళ్ళు వత్తు కున్నప్పుడు తన చెప్పులు ఇచ్చేశాడు.
తను
కప్పుకున్న వస్త్రం లో నాకు దుస్తులు కుట్టించాడు.
వేటాడి
తెచ్చిన ఆహారాన్ని నేను మిగిల్చాకే ముట్టుకున్నాడు.
నాకు
గాయం అయితే తాను కన్నీరు కార్చాడు.
మెత్తటి
పరుపు నాకిచ్చి గరుకు నేలమీద నిద్ర పోయాడు.
నాకు
సుస్థిగా ఉన్నప్పుడూ నా మంచం పక్కనే ఉన్నాడు.
నేను
విజయం సాదించినప్పుడు ఊరంతా చెప్పాడు.
నేను
పరాజయం పాలయినప్పుడు కొత్త మార్గం చూపాడు.
నేను
వెళ్లబోయే మార్గాలలో తివాచీ పరిచాడు.
నేను
శిఖరం ఎక్కాక నాకు కనిపించడం మరిచాడు.
వలయం
నన్ను మొదలెట్టమని అక్కడినుండే ఆదేశించాడు.
నాన్నా
... నేను చూసిన దేవుడువి నువ్వు.
**
(happy father’s day)
No comments:
Post a Comment