నెఫ్రాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్, బార్య సాధన పెట్టుకున్న నియమం అది.
ఎంత బిజీ గా ఉన్నా తామిద్దరికోసం రోజు ఉదయం కొంత సమయం కేటాయించుకోవటం, ఆ సమయం లో తమ గురించి కాక మరే ఇతర
విషయాలు సాద్యమయినంతవరకు మాట్లాడుకోకపోవటం .
ఆరోజు గేటెడ్ కమ్యూనిటీ లోని BR అపార్ట్మెంట్స్ లో 4,5 అంతస్తులు కలిపి
ఉన్న డూప్లెక్స్ ఫ్లాట్ పోర్చ్ లో కూర్చుని కాఫీ తాగుతున్నారు ఇద్దరు. అప్పటికే ఇంట్లో
ఉన్న చిన్న జిమ్ లో ట్రేడ్ మిల్ మీద కొంత సేపు
వ్యాయామం చేసి పోర్చ్ లో ఉన్న పేము కుర్చీ లో కూర్చుని పేపర్ తిరగేస్తున్నాడు. ట్రే లో కాఫీ కప్పులు సాల్ట్ బికిలు
పట్టుకుని సాధన రాగానే చేతి లో పేపర్ మడిచి కాఫీ కప్పు అందుకున్నాడు.
“ఎంటమ్మాయ్ ఏమిటి కబుర్లు ?” బిస్కెట్ అందుకుంటూ అడిగాడు.
సాదన బుగ్గ చొట్ట బడేట్టుగా నవ్వింది.
రోజు ఉండే పలకరింపే అయినా వాళ్ళకి ఎప్పుడు ఆ సాన్నిహిత్యం లో మోనాటనీ
రాలేదు.
విశాలమయిన గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ల వాకింగ్
ట్రాక్ ఉంది చాలా మంది ఇంకా వాకింగ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళని గమనిస్తూ ఇద్దరు కాఫీ
ఎంజాయ్ చేస్తుంటే హటాత్తుగా కిందనుండి ఒక ప్రౌడ చంద్రశేఖర్ గారిని చూసి చిన్నగా నవ్వి
చెయ్యి ఊపింది. చంద్రశేఖర్ చేతిని గాల్లో ఊపటం ద్వారా బదులివ్వటం సాధన గమనించింది.
*****
సాయంత్రం ఓ పి సమయం లో ఆటో
లో హాస్పిటల్ కి వచ్చిన సాధన నేరుగా చంద్రశేఖర్ రుముకు వెళ్ళి కారు కీస్ తెచ్చుకుంటుంటే
.. వైటింగ్ రూములో ఆవిడ మళ్ళీ కనిపించింది. చక్కటి శరీరాకృతి ప్రౌడవయసు స్త్రీ నుడిటీ
పాపిట మధ్య సింధూరం.
****
మర్నాడు తమ కాఫీ టైమ్ లో “ఎవరావిడ?” అంది సాధన.
అతను అప్పుడు గమనించాడు. ‘ఆవిడే’ చెమట్లు పట్టెట్టు గా బ్రిస్క్
వాకింగ్ చేస్తూ...
చంద్రశేఖర్ మాట్లాడటం ఇష్టం లేని వాడి లా ఉండి పోయాడు.
సాదన చూపుల్లో ప్రశ్న ఇంకా కనబడటం గమనించాడు అతను.
“టి వి సిరియల్స్ చూడటం తగ్గించు. సమయం ఉంటే క్లినిక్ కి వచ్చి అక్కౌంట్స్
చూసులో నాకు రోజు లో మరో గంట కలిసొస్తుంది. హాస్పిటల్ క్వాలిటీ పెరుగుతుంది. నానా చెత్త
బుర్రలోకి దూర్చకు” చెప్పాడతాను.
“ఇది సమాదానం కాదు “ ఆమె అభావంగా అంది.
“కిడ్నీ సమస్య ఉన్న పదేళ్ళ కొడుక్కి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు
ఆవిడ. చాలా వరకు డ్రగ్స్ తో నయం అవోచ్చు లేదా వరెస్ట్ కేస్ లో ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరం అవోచ్చు. ఒకవేళ అలా జరిగాల్సి
వస్తే ఆమె డొనేట్ చేయటానికి కనీసం 20 కేజీలు బరువు తగ్గాల్సి ఉంది”
ఒక చల్లటి గాలి అతని మీదుగా ఆమెని తాకింది.