Monday, 29 February 2016

MBA ప్రేమలేఖ

ఒక MBA కుర్రాడు (HR మానేజర్ ) అనుకోండి వ్రాసిన ప్రేమ లేఖJ
డియరెస్ట్ మిస్ గార్గేయి ..
Sub: ప్రేమ ధరఖాస్తు
ఈ నెల 21 తేదీ (శనివారం) నుండి మీతో ప్రేమలో పడ్డ విషయం మీకు తెలియచేయడానికి సంతోషం గా ఉంది. 20 వ తేదీ ఫిబ్రవరి (శుక్రవారం ) నాటి 15.00 గంటల మన సమావేశాన్ని మీ దృష్టికి తెస్తున్నాను.
నన్ను నేను ఒక స్టిర చిత్తం గల బావి ప్రేమికుడిగా అభివర్ణించుకుంటున్నాను. మన ప్రేమ వ్యవహారం మూడు నెలల పాటు పరిశీలన లో ఉంటుంది. పరిశీలనా కాలం లోని అనుకూలతని బట్టి శాశ్వత స్థానం పొందుతుంది.
పరిశీలనా కాలం లో నైపుణ్యాల మెరుగుదల, పరిణీతి ల పై శిక్షణ ఉంటుంది. ప్రేమికురాలి నుండి అర్ధాంగి గా ఉన్నతి పొడటానికి  ఈ శిక్షణ దోహదం చేస్తుంది.
పరిశీలనా కాలం లో ఖర్చు అయ్యే, టి ,కాఫీ, పాని పురి, పల్లిలా ఖర్చులు  కొద్ది కాలం పాటు సమానంగా  భరించాల్సి ఉంటుంది. తదుపరి మీ నైపుణ్యాలను బట్టి ఖర్చు లో ఎక్కువ భాగాన్ని నేను భరాయించే అవకాశం కూడా ఉంది. ఏమయినా పూర్తి చిల్లర ఖర్చులు, మీ చిన్న చిన్న షాపింగ్ ఖర్చులు నేను అందిపుచ్చుకోగల విశాల మనసు ఉందని కూడా తెలియ చేస్తున్నాను.
ఈ లెటర్ అందిన 30 పని దినముల లోగా స్పందించ గలరని, లేని యడల మికు కేటాయింపబడిన ఈ అవకాశం ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండానే రద్దు అయ్యే అవకాశం ఉందని గ్రహించ గలరు. తదుపరి జాబితా లో ఉన్నవారికి ఈ అవకాశం మళ్లింప బడుతుందని తెలుసుకోగలరు. ఆసక్తి లేనిచో మీరే మీ స్నేహితురాలు ఎవరికయినా ఈ లెటర్ ను బట్వాడా చెయ్యగలరు. ఏది ఏమయినా మీరీ అవకాశాన్ని అంది పుచ్చు కోవాలని కోరుకుంటున్నాను.
మీకు శుభ కామనలు . మీకు ముందుగా దన్యవాదాలు .

భవదీయ ...

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...