Wednesday, 3 February 2016

లక్ష్మణుడినే

మనం నేర్చుకోవాలే గాని మన మధ్య చాలా మంచి విషయాలు ఉంటాయి..
..
నా మిత్రుడు 'హనుమంత రావు' అని ఒకరు ఉన్నారు . బాంకు ఉద్యోగి.
..
ఎప్పుడు చేనేత చొక్కాలు వాడతారు. ..
మరొకటి వేసుకోగా నేను ఈ 15 ఏళ్లలో చూడలేదు.
ఎప్పుడో కాలేజీ రోజుల్లో చేనేత మగ్గాలని చూడటానికి వెళ్ళి వారి శ్రమ /దోపిడి బాదలు చూసి
"ఉద్యోగం వచ్చాక ఎప్పుడు చేనేత బట్టలే వాడతాను " అని మనసులో అనుకున్నారట.
గత 30 సంవత్సరాల నుండి అదే మాట మీద ఉన్నారు.
***
గ్రౌండ్ ఫ్లోర్ గా ఉన్న ఇంటిని మరో రెండు ఫ్లోర్స్ అదనంగా వేసినప్పుడు.
మంచి ఫ్లోరింగ్ తో ఉన్న పోర్తికో కింద స్థలాన్ని తవ్వించి. పెద్ద 'ఇంకుడు గుంట'
కట్టించాడు. నేను వారించినా వినలేదు. (నిజానికి నేను ప్రోత్సహించాల్సి ఉంది)
కమిట్మెంట్ అంటే అది.
**
మనం కళ్ళు తెరిచి గమనించాలే గాని మన చుట్టూ రత్నాలు చాలా ఉన్నాయి.
ఇలాటి మిత్రులే నాకు బలం. వారికి నేను ఎప్పుడు లక్ష్మణుడినే. smile emoticon grin emoticon
‪#‎susri‬

No comments: