Friday, 5 February 2016

మహేంద్ర డ్యూరో, 70 కి మీ మైలేజ్


ఉదయాన్నే షు వేసుకుని మెట్లు దిగుతున్ననా, పోర్తికో లో మహీంద్రా డ్యూరో (Mahindra duro 2 వీలర్ ) దీనంగా నిలబడి ఉంది. అప్పటికే చమటోడ్చు తూ ఉంది. 
మరో వైపు మెట్ల కింద ఉంచిన తుప్పు పట్టిన వాషింగ్ మెషీన్ ని, ఏనుగు లాటి GRINDIG టి‌వి ని ఒరకంట గమనిస్తూ ఉంది. 
దగ్గరకి వెళ్ళి ప్రేమగా చెయ్యి వేశాను. వళ్ళంతా తడిచి ఉంది .
..
గేటు బయట మా గుండమ్మ పేడ కల్లపి మీద ముగ్గు వేస్తూ కనబడింది. ..
ఇవాళ్ళ కూడా బండి మీద నీళ్ళు పోసావుగా??” 

"చిమ్మి కడిగినప్పుడు కొంచెం పడ్డట్టు ఉన్నాయి.అంది.

కానీ కావాలనే నీళ్ళు గుమ్మరించిందని నాకు ప్రగాడ నమ్మకం. 
కొన్నాళ్ళకి క్రమేణా తుప్పుపట్టటం తద్వారా పాత ఇనుము వాడికి మరో వస్తువు సిద్దం కావటం జరగ బోతుంది.
...
ఆ మధ్య అవసరార్ధం ఆవేశంగా మా వాడి కోసం సెకండ్ సేల్స్ లో కొన్నాను ఈ బండి.
బండి తెల్లగా ముద్దుగా సూపర్ గా ఉంది, సీటు కింద మంచి స్టోరేజ్ స్పేస్ల, 
సిగ్నల్ లైట్స్, ఆటొ స్టార్ట్.. అబ్బో ఇరగడిస్తుంది. 
మావాడు సరిగ్గా రెండు రోజులు కాలేజీకి వెళ్ళి ఫీడ్ బాక్ 'సూపర్ నాన్నా' అని ఇచ్చాడు. 
తర్వాత నుండి మల్లెపూవు లాగా కాలేజీకి వెళ్ళి ముఠామేస్త్రీ లాగా ఇంటికి చేరటం మొదలెట్టాడు. ఏమయిందిరా అని అడిగితే.. నేను కాలేజీ కి నడిచి పోతాను అన్నాడు. 
వాడిని సముదాయించి మరి మరి అడిగితే
మీరొకసారి తొలి చూడండి అన్నాడు. 

...
పిల్లాడిని ఎక్కించుకుని స్టార్ట్ చేసి జామ్మంటు ఒక కిలో మీటరు వెళ్లానో లేదో ...బండి సైలెన్సర్ లోంచి తుప్పు మని శబ్దం వచ్చి ఆగి పోయింది. 
అంతే దానిని స్టార్ట్ చెయ్యటం మా వల్ల కాలేదు పరిచయం ఉన్నవాళ్లని /లేనివాళ్లని అందర్నీ బతిమాలి షెడ్డు దాకా నేట్టించుకుని వచ్చాం. 
దానిని చూడంగానే ఏం సర్ పాత ఇనుము వాడి వద్ద కొన్నారా అన్నాడతను.  
బండి విప్పి ఏదో సారి చేసి పెట్టాడు. స్టార్ట్ అయ్యింది జామ్మంటు వచ్చాం 
మళ్ళీ కిలోమీటలు రాగానే తుప్పు మని సౌండు.. అబ్బా కొడుకులం నెట్టు కుంటూ ఇంటికొచ్చామ్.
..
ఇక దాని సంగతి నేను మాట్లాడటం లేదు వాడు కూడా..
ఆ బండి అమ్ముతారా ?? ఉల్లిపాయలకి వెయ్యమంటారా? “ మా ఆవిడ అల్టిమేటం...

..
"అరె జి‌డి‌పి తగ్గి పోయింది. అదేదో  రెప్ అంట దాని పరిస్తితి బాలేదు. 

షేర్ మార్కెట్ పరిస్తితి అయోమయంగా ఉంది . రియల్ ఎస్టేట్ పరిస్తితి బాలేదు. 
అమరావతి లాండ్ పూలింగ్ లోనే రేట్లు లేవు. రియల్టర్స్ చాలా మంది తెల్లవారుజామునే రైల్వే స్టేషన్ లో మెత్తటి ఇడ్లీలు, మొహం పుల్లలు, కాఫీ పొడి పోట్లాలు అమ్ముకుంటున్నారు. 
ఇక మన బండికి మంచి రేటు వచ్చే అవకాశాలు దగ్గర లో లేవు “.. నేను వివరించే లోపు 
ఈ సుత్తి అంతా నా కొద్దు . అది అమ్ముతారా లేదా నేనో ఒకరోజు ఉల్లిపాయలకి వేస్తాను’”అంది.

..
అదిగో అప్పటి నుండి దాని బాగోగులు ఆమె పట్టించుకుంటుంది. 
రోజు పేడ నీళ్ళతో తల స్నానం చేపిస్తుంది. 
ఒళ్ళు తుడవటం మాత్రం నాకు కేటాయిస్తుంది
..
ఈ రోజు దీన్ని మార్కెటింగ్ చెయ్యాలి తప్పదు . 
కాలింగ్ బెల్లు కొట్టి మేడ మీద ఉన్న మా అబ్బాయిని పిలిచాను, ..
గుండమ్మకి వాడికి వినబడెట్టుగా రాయలసీమ ఫాక్షనిస్టు స్థాయిలో రేయ్ బండి తియ్అని అరిచాను. 
వాడు క్షణాల్లో కిందకి వచ్చి కొత్తగా కొన్న హీరో ఐ స్మార్ట్ తీశాడు. 
వాడికి నచ్చచెప్పి మహీంద్ర బండి తీశాను .
..
స్టార్ట్ చేయకుండా బండి తోసుకుంటూ .. ఉదయాన్నే మా మిత్రులందరం పోగయ్యే చోట కి ఒక కిలో మీటరు ముందు స్టార్ట్ చేసుకుని స్టైల్ గా బండి ఆపాం ...
..
బండి మార్కెటింగ్ మొదలెట్టాము. ..
అబ్బా ఏం బండి, ఏమి కలరు, ఎంత స్టోరేజే స్పేస్ లాటి నిజాలు ఇద్దరం కలిసి చెబుతుంటే మొహమాటానికి మా ఫ్రెండ్ ఒకడు 

సుశ్రీ మైలేజ్ ఎంత వస్తుంది ??” అన్నాడు.

..
“70-72 దాకా “..

..
అక్కడంతా నిశబ్దం . 
మిగిలిన మిత్రులు మమ్మల్ని మా బండి ని అపనమ్మకం గా చూశారు. 
గేర్లెస్ బండి 40 కిలోమీటర్లు ఇవ్వడమే చాలా గొప్ప అలాటిది. 
నిజమా 

నిజం గా నిజం .. నేనెప్పుడు 200 కి(మూడు లీటర్లు) పెట్రోల్ కొట్టిస్తాను. ప్రతిసారి 70 కిలోమీటర్లు తగ్గకుండా వస్తుంది మైలేజే.”..

..
రెండు నిమిషాల్లో ఆ స్థలం ఖాళీ చేసి అందరూ ఇంటి మొఖం పట్టారు. 
నేను మావాడు స్టైల్ గా బండి స్టార్ట్ చేశాం. 
మరో కిలో మీటరు వరకు డోకా లేదని మా ఇద్దరికీ గట్టిగా తెలుసు. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...