గీజర్ లో నీళ్ళు చల్లగా ఉన్నాయి.
షేవింగ్ చేసుకుని, స్నానం ముగించి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను.
ప్లేట్లో ఏదో ఒక గుండ్రటి పదార్ధం వచ్చింది.ప్రక్కనే ఎప్పుడుచిన్న బాండీ లో తాలింపు
వేసిన పప్పుల చట్నీ ఉండేది. అది లేదు. జాడీ
పచ్చడి నేను తిననని తెలిసి వడ్డించింది.
రోజు లా ప్రశాంతంగా లేదు .. తను కొంత టెన్స్ గా
ఉంది. సాయి కాలేజీకి వెళ్ళాడు. ఏం జరిగింది?? క్యా హువా?? గత 24 గంటల ని స్కాన్ చేశాను. రాత్రి టివి చూస్తూ పెద్దగా నవ్వానా? తాను సీరియల్ చూస్తుంటే దైర్యంగా రిమోట్ తీసుకుని న్యూస్ చానెల్ మార్చానా? లేక ఘోరంగా తాను ఏదయినా చెప్పెటప్పుడు నిద్ర పోయానా? ఏమి గుర్తు లేదు. అంత ఘోరమయిన విషయాలు జరిగిన గుర్తు లేదు.
WA మెసేజ్ లు చూసే అవకాశం లేదు. లాక్ పేట్రన్
మార్చాను. మరి??
ఇంకొంచెం వెనక్కి వెళ్ళి 28 ఏండ్ల క్రితం పెళ్లి
రోజు అన్నం తింటుంటే మంచి నీళ్ళ గ్లాసు తగిలి తన చీర మీద నీళ్ళు వణికాయి. అదేమయినా
గుర్తొచ్చిందా?? ఏమో ఈ ఆడాళ్ళా ప్రాసెసర్ మోస్ట్ పవర్ ఫుల్.
ఏమి గుర్తుకు రాలేదు. నిద్రలో పొరపాటున కాలు వేయటం/ గురక పెట్టటం/ కనకాన్ని కలవరించడం ??? ఊహూ ఏమి గుర్తు
రాలేదు.
ప్లేట్లో ఆవిటి కుడుము అల్లం పచ్చడి లో నంచుకుని
మొహం లో ఆనందాన్ని నటిస్తూ రాజీవ్ బట్టాచార్య చెప్పినట్టు 32 సార్లు నముల్తూ ఆలోచించాను.
కానీ ఏమి అర్ధం కాలేదు.
పరిస్తితి మరి అంతా అననుకూలంగా ఏమీలేదు . ఈ సన్నివేశం
లో మనకి ఒకటి రెండు డైలాగుల ఛాన్స్ ఉంది.
గొంతు సవరించుకోవటం లాటివి చేసి గట్టిగా గుండెల్లోకి
గాలి పిల్చుకుని
“ఆవిటి కుడుం బాగుంది. చట్నీ చెయ్యక పోయావా??”
తను గ్లాసు తో మజ్జిగ తచ్చి పక్కనే నిలబడి “ రాత్రి
నుండి కరెంటు లేదు. ఇన్వెర్టర్ చివర్లో ఉంది. మిక్సీ పని చెయ్యట్లేదు. రోట్లో రుబ్బాను.
మీరు తింటున్నది పెసరట్టు . ఈ పుటకి సర్దుకోండి. బాబు అన్నం తిని వెళ్ళాడు “ అంది సౌమ్యంగా.
హమ్మయ్య అదన్నమాట సంగతి.
మీరు బలేవారండి బాబు... రధ సప్తమి పూట బంగారం
లాటి కాపురం లో పోపు పెట్టాలని చూస్తారు .. హన్నా ..
No comments:
Post a Comment