Saturday, 27 February 2016

అవుట్ డేటెడ్

గృహావసరాల కోసం 600 అడుగుల డీప్ బోర్ లో నీళ్ళు అడుగంటుతున్న  
ఒక ప్రకాశం పశ్చిమ ప్రాంతానికి ఇరిగేషన్ ఏయీ వివాహానికి గతరాత్రి వెళ్ళాను.
..
భారీగా ఏర్పాట్ల మధ్య, పాట కచ్చేరి లో “మంచమెక్కి ..” అంటూ చిరంజీవి పాటలకి ఆడపిల్లల డాన్సులతో ఇరగదీశారు. పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ తో అల్లాడించారు...
..
ఈ లోగా తెలిసిన అతన్ని ఆదారంగా చేసుకుని, చాకచక్యంగా అందిన కాడికి బోజనమ్ చేశాను. ఈ పోరాటానికి కొంత సమయం పట్టింది. ..
తిరిగి వేదిక వద్దకి వచ్చే సరికి మంచి ఊపు మీద పాటలు – ఆటలు ముతక జోకులు...
..
సందట్లో సడేమియాలాగా మంత్రమన్నది ఎవరి చెవికి వినబడకుండా పెళ్లి తంతు ముగిసింది.
బాలయ్య పాటలు హామ్ చేస్తూ వధూవరులని దీవిస్తున్నట్టు ఫోటోల కార్యక్రమం జరుగుతుంది...
..
నేను అక్షితలు ఎక్కడ ఉన్నాయో కనుక్కుని, వాటిని సాదించి పిల్లల్ని ఆశీర్వదించి వేదిక దిగేటప్పుడు వధువు “పెద్దమ్మ రాలేదా.. పెదనాన్నా” అని చెవిలో ఆప్యాయత రంగరించి పోసింది.
..

 తనకి సమాదానం చెప్పి రోడ్డున పడ్డాను...
..
అతిదులలో బోజనాల వద్ద ఒక పెద్దాయన “మేము మావే వాడుకున్నాం.. మీరు మీ ముది మనవల్ల వాటా కూడా వాడేసుకుని, రంగు కాగితాలు మిగులుస్తున్నారు” అనడం మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది.

మంచి డాన్సు ప్రోగ్రాంలు చూడకుండా  పెద్దాయన నీటి వెతల విషయాలు చెబుతుంటే ఎబ్బెట్టుగా లేదూ ??

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...