Tuesday, 1 March 2016

షాపింగ్ .. షాపింగ్

ఊహూ .. ఆ పై అరలో ఊదారంగు చీర తియ్యండి
అప్పటికే ఒక యెనబై చీరలు చూసి ఉంటుంది ఆమె. 
సేల్స్ గర్ల్ కి విసుగ్గా ఉంది 
కానీ మొహం లో అది కనబడనియ కుండా, 
మెట్లు ఏర్పాటు ఉన్న స్టూల్ ఎక్కి ఆ రంగు చీర తీసింది.
..
బస్టాంట్ దగ్గరగా ఉన్న ఏసీ వస్త్రాలయం . ఖరీదయిన చీరలు కి పెట్టినిల్లు.

గంట క్రితం వచ్చిందామే. ఆమెతో వచ్చిన 
ఆరేడు ఏండ్ల చిన్న పిల్లాడు మ్యాంగో జూస్ రెండు గ్లాసులు తాగి,
సెల్ లో గేమ్స్ ఆడుతున్నాడు. 
..
దీని పమిట డిజైన్ చూపించండిసేల్స్ గర్ల్ చీర మడతలు విప్పి, 
"
ఇది లేటెస్ట్ డిజైన్ మాడమ్, బ్లౌస్ పీస్ కూడా ఇందులో ఉంది కావాలంటే కట్ చేసి కుట్టించుకోవచ్చు లేదా ఇలానే ఉంచి మరో డిజైనర్ బ్లౌస్ తీసుకోవచ్చు
..
దీంట్లో రెండు షేడ్స్ వస్తున్నాయి కదా ఆ మోడల్ లేవా?” ..
క్షుణ్ణంగా పరిశీలించాక అడిగిందామే.
సేల్స్గ గర్ల్ కి విసుగొచ్చింది. హమ్మయ్య సెలెక్షన్ అయిపోయింది అనుకోవటం 
చివర్లో మరేదో లేదా అని అడగటం, గంట నుండి అన్నీ కుప్ప పడేయించింది. 
ఇవన్నీ తిరిగి సర్దుకోటానికే మరో గంట ఖాయం గా పడుతుంది.
..
వెనక్కి తిరిగి పై రాకు లోని మరి కొన్ని చీరలు తీసి చూపించింది. ..
ఈ కలర్స్ ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ మాడమ్. హాఫ్ జెరీ వి. 
ఎప్పటికయినా జరి వరకు అమ్మినా సంగం పైగా డబ్బులు రిటన్ వస్తాయి 
ఆ ఆమ్మాయి ఆశగా చెప్పింది.
..
ఇంతలో పిల్లాడి చేతిలో సెల్ మోగింది. ..
..
ఈమే అందుకుంది . 
ఏమండీ వచ్చారా? ఎండ మండి పోతుంది. బస్సు దిగి గంటయింది. 
ఇప్పుడా మీరొచ్చేది. అక్కడే ఉండండి పక్కనే ఉన్నాను ‘ ..
సెల్ ఆపి రే బాబు నాన్న వచ్చారు పోదాం పద  
ఆమె క్షణాల్లో మాయం అయింది. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...