Wednesday, 10 February 2016

పెద్దల పరీక్షలు

సెకండ్ ఇంటర్ చదివే పిల్లల తల్లి తండ్రులు MPC/BiPC ఏదయితేనేం 
ఫిబ్రవరి/మార్చ్ నెలల్లో కనీసం 10 నుండి 12 రకాల పరీక్షలకి డబ్బు కట్టాల్సి వస్తుంది.
అధమం గా చూసుకున్నా 20000 ఖర్చు. మార్చి నెలలో చాలామంది ఉద్యోగులకి జీతం రాదు. ( IT)
**
మే నెల దాకా బొంగరం లా పరీక్ష కేంద్రాలకి తిరగవల్సి వస్తుంది. 
తల్లి తండ్రులు శెలవలు పెట్టుకుని నానా ఇబ్బందులు పడాలి. .
మరో 20/30 వేల ఖర్చు వస్తుంది. విధ్యార్దినుల పరిస్తితి మరి అధమం. 
పాపం సరైన సౌకర్యాలు కూడా ఉండవు.నేచురల్ కాల్స్ కి కూడా కష్టమే.
**
ఇర్రెగ్యులర్ షెడ్యూల్స్ .. అలసట పిల్లల్ని 
పూర్తి స్తాయి performence నుండి దూరం చేస్తాయి.
నిజానికి ఇన్ని ప్రవేశ పరీక్షలు అవసరమా??
***
సరే పిల్లల్ని వత్తిడి పెట్టి రాయించామనుకోండి.
సీట్లు అమ్ముకున్న కాలేజీ పిల్లలకి ముందు రోజు రాత్రి చాటుగా సమాదానాలు అందుతాయి.
మరెందుకీ ముచ్చట?? డ్రామాలు ?? రిజర్వేషన్ విశ్వరూపాల గురించి మాట్లాడుకో నవసరం లేదు 
***
సమాజం పట్ల ఒక రకమయిన 'కసి' తో పిల్లలు బయటకి వస్తారు.
వివిద హోదాల్లో పని చేసే చోట ఎంత వద్దన్నా నిగూడంగా ఉన్న 'అసంతృప్తి'
తిరిగి సమాజం మీదకి గోడకి కొట్టిన బంతి లా తిరిగి వస్తుంది. (చాలా సార్లు)
***
మనం ఆలోచించలేమా?? దీనికి ముగింపులేదా?? క్షేత్ర స్తాయిలో దృష్టి పెట్టకుండా 
వంకర ఫలాలకి మందు చల్లుకుంటూ గడుపుదామా??
‪#susri 100216

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...