Tuesday, 16 February 2016

మాటల్లేవ్ :)

మా వాడు చదువుతున్న పుస్తకాన్ని పూర్తి చేసి హల్లో కొచ్చే సరికి 
వాళ్ళ అమ్మ పద్మాసనం లో కూర్చుని సెల్ ఫోన్ లో రాందేవ్ బాబా వీక్లీ యోగా చూస్తూ ప్రాణాయామం చేస్తూ ఉంది.
..
జంపఖానా మీద వాళ్ళ అమ్మ పక్కనే పడుకుని కాసేపు అటు ఇటు దొర్లాడు . 
ఫోన్ లో గురుజి ని చూస్తూ ఉంటే ..
..
రాత్రి హింది సీరియల్ చూసిన ఎఫెక్ట్ తో
“దేఖనే సే కోయి ఫాయిదా నహి హోతా.. కర్నే సే హోతా “ అంది వాడితో ..
..
“ఇసిలియే మై నహే దేక్తా” అంటూ వాడు లేచి బాత్ రుము కి వెళ్ళాడు ..
..
ఈ సన్నివేశం లో నా ప్రమేయం ఏమయినా ఉందా చెప్పండి.??
..
సోఫాలో కూర్చుని అమాయకంగా పేపర్ లో ప్రణీత ని పరామర్శిస్తుంటే --..
నన్ను సూటిగా చూడట మెందుకు ??
..
“అయ్య బుద్దులు ఎక్కడికి పోతాయ్ అని వినబడేట్టు గా గొణగట మెందుకు ??
..
మార్నింగ్ ‘టి’ వచ్చిందాకా ఈ సన్నివేశం లో
మనకి డైలాగులు లేవు కనుక ... tongue emoticon


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...