కనకం బస్సు ఎక్కింది.
చిన్న వంగ పూల తెల్లటి మెత్తటి చీర.
ఫుల్ వాయిల్ గుడ్డలో వాక్యుం పాక్ చేసినట్లు... wink emoticon
ఎప్పటిలాగే తలనిండా కనకాంబరాలు ..
***
ఖాళీ సీట్లు లేని బస్సులో , హ్యాండ్ బాగు పైన ఉంచి నిలువు రాడ్డుకి శరీరం ఆనించి నిలబడి ఉన్నాను.
ఆమె విప్పారిన కళ్ళతో నావైపు చుసేలోగా,
మైదాన్నాన్ని టోపీ తో కప్పెట్టి,
కుండ లోపలి లాగాను.
ఏటో చూస్తున్నట్టు నటిస్తూ తననే చూస్తున్నాను.
(నిజానికి ఇది ఆడవాళ్ళ విద్య మనకి చాతకానిది. అయినా వెర్రి మొహం వేసుకుని ప్రయత్నిస్తుంటాం )
తను నా వైపు నేరుగా చూడలేదు కాని, చూసినట్టు పెదవుల చివర నవ్వు నన్ను చేరింది. తను నుదిటి మిద జుట్టుని, అవసరం లేని పమిటని నేను గమనించేట్టు సర్దుకుంది.
**
టికెట్ తీసుకుంటూ నా రెస్పాన్స్ కోసం చూసింది. నేను అభావంగాను,
తరువాత పచ్చి ఆముదం తాగిన వాడిలాగాను, 'ఇగిలికం' ఉండ మింగిన వాడి లాగాను వికారంగా ముఖం పెట్టాను.
అప్పటికే కొందరు ఆమెని గమనిస్తూ ఉన్నారు.
నేను మండల దీక్ష తీసుకున్న తివ్రవాడిలా నిలబడి కుండని జాగర్తగా నియంత్రిస్తున్నాను.
***
జీవితం చానా చండాలమయినది.
మనం భక్తిగా కొండకి వెళ్తున్తామా, మన కారు కింద నాటు కోడి పుంజు పడుతుంది. చుట్టూ ఎవరు ఉండరు. బోరున దుఖం తన్నుకొస్తుంది.
ఎక్కడో అడవిలో రాత్రంతా చిక్కుకు పోతాం.
మర్నాడు ఉదయం రోజుకో సారి వచ్చే బస్సు ఎక్కగానే కండక్టర్, 'మీరున్న చోటుకి పక్కనే ఈతకల్లు, బొంగు చికెన్' దొరుకుతుంది.. బాగా ఎంజాయ్ చేసారా?? అంటాడు. అతన్ని కాష్ బాగ్ తో ఉఋ వెయ్యకుండా నియంత్రించు కుంటాం.
**
(మాస్టారూ ఎక్కడికో వెళ్ళిపోయారు బస్సులోకి రండి సార్)
**
టికెట్ కొనే టప్పుడు బాగ్ లోంచి తీసిందో.. ..
లేక నేను చూడాలని తీసిందో చేతిలో సెల్ ఫోను పట్టుకుని ఉంది కనకం.
తన ఫోన్ నెంబరు నాకు తెలియచేయాలనో లేక
నా నెంబరు తను తిసుకోవాలనో సంకేతం అది.
మికెలా తెలుసు అంటారా. ఇట్టాంటివి ఆ రోజుల్లో ఎన్నెన్ని చూడలేదు tongue emoticon
**
హటాత్తుగా ఆమె కళ్ళకి నా కళ్ళు దొరికాయి.
సెల్ టవర్ మిదేక్కి కుర్చునట్టు సిగ్నల్ అయిదు పాయింట్లు ఫుల్ గా ఉంది.
ఈ లోగా బస్సు లోకి సుర్యుడు వచ్చినట్లుంది.
బస్సు వేడిగా ఉంది. ఎండ వీపుని తాకుతున్నట్లు ఉంది.
**
ఆమె కళ్ళతో ఎదో చెబుతుంది.
సిస్టం అంతా వైరస్ . ఎదో అర్ధమయి అర్ధమవనట్టు ..
నాకు కాళ్ళు వణుకుతున్నాయి..
**
ఆమె అక్కడి నుండి నావైపు రావటం మొదలెట్టింది.
నాకు కళ్ళు తిరిగేలా ఉన్నాయి. వెనుక నుండి ఎండ బూతద్దాల లోంచి చుక్కలా మారి వీపున గుచ్చు కుంటుంది.
**
ఆమె మరో రెండు అడుగులు నా వైపు నడిచింది.
..
నా గుండె జారి పోయింది. గబాలున వెనక్కి తిరిగి వెనుక సీట్లో ఇరుక్కొని కూర్చుని నన్ను కనకాన్ని మింగేసాలా చూస్తున్న మా ఆవిడ ని చూస్తూ
“ షేర్ మార్కెట్ 700 పాయింట్లు పడి పోయింది తెలుసా ???” బిగ్గరగా అరిచాను.
***
అర్జునా.. ఫాల్ఘునా... కిరీటి ..

No comments:
Post a Comment