Friday, 13 January 2017

సర్వస్వ సమర్పణ

పొడవయిన రెండు భవనాల మధ్య ఒక తాడు కట్టబడి ఉంది.
దాని మీద ఒక వ్యక్తి నడవసాగాడు...
వందల అడుగుల ఎత్తున జాగర్తగా ఒక యజ్ఞం లాగా నడవ సాగాడు.
చేతిలో పొడవయిన కర్ర ఉంది. బుజాన అతని కొడుకు ఉన్నాడు. ..
అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెండో భవనం వైపు వచ్చాడు. ..
అందరూ చప్పట్లు కొట్టారు.
కేరింతలలో ఆహ్వానం పలికారు.
చేతులు కలిపారు.
ఫోటో లో తీసుకున్నారు...
“నేను ఈ తాడు మీద తిరిగి అవతలికి వెళ్లాలను కుంటున్నాను.
వెళ్లగలనా?” అతను ప్రశ్నించాడు. ..
“వెళ్లగలవు.. వెళ్లగలవు” జనం సమాదానం...
“నా మీద నమ్మకం ఉందా?”..
“ఉంది .. ఉంది.. మేం పందానికి అయినా సిద్దం” ..
“అయితే మిలొ ఎవరయినా నా భుజం మీద ఎక్కండి. అవతలకి తీసుకు పోతాను”...
అక్కడంతా నిశబ్దం.. ..
జనం మాటలు ఆగి పోయాయి.
ఎవరికి వాళ్ళు నత్త ల్లాగా గుల్ల లోకి తలలు లాక్కో సాగారు.”..
ఉలుకు లేదు .. పలుకు లేదు...
నమ్మకం వేరు విశ్వాసం వేరు...
విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి...
దైవ భక్తి లో మనం కోల్పోతున్నది ఇదే.


..
శుబోదయం. మిత్రులకి _/][\_

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...