Sunday, 15 January 2017

వై మి?


ఆర్థర్ ఆష్.... ప్రపంచ చరిత్రలోనే ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ ను గెలుచుకున్న తొలి నల్లజాతీయుడు....
...
1983 లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకుంటూండగా పొరబాటున కలుషిత రక్తం ఎక్కించడంతో ఆయనకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది.
..
ఈ వార్త విని ఆష్ అభిమానులు మిన్ను విరిగి మీద పడ్డట్టు ఖిన్నులయ్యారు.
వేలాది మంది కన్నీటి లేఖలు వ్రాశారు.
..
అందులో ఒక అభిమాని "మీకే ఎందుకు ఇంత భయంకరమైన వ్యాధి వచ్చింది. " అని చాలా బాధతో వ్రాశాడు. "అసలు దేవుడికి మిమ్మల్నే బాధ పెట్టాలని ఎందుకు అనిపించిందో?" అని అడిగాడు.
..
దానికి ఆష్ ఇలా జవాబిచ్చాడు.
..
"యాభై మిలియన్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడితే అందులో యాభై లక్షలమందికే ఆట సరిగ్గా అబ్బుతుంది."
"అందులో అయిదు లక్షల మందే ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాళ్ల స్థాయికి చేరుకుంటారు..."
"అందులో యాభై వేల మంది మాత్రమే టోర్నమెంట్ సర్క్యూట్ ఆటల స్థాయికి వస్తారు...."
"వారిలో అయిదు వేల మంది మాత్రమే గ్రాండ్ స్లామ్ స్థాయికి ... అంటే వింబుల్డన్....అమెరికన్ ఓపెన్... ఆస్ట్రేలియన్ ఓపెన్... ఫ్రెంచ్ ఓపెన్ ల స్థాయికి వెళ్తారు. వారిలో యాభై మంది మాత్రమే వింబుల్డన్ లో గట్టిపోటీనిస్తారు."
"వారిలో నలుగురే సెమీఫైనల్ కి వెళ్తారు."
"అందులో ఇద్దరే ఫైనల్ కి వస్తారు....."
"అలా ఫైనల్ లో గెలిచిన వాడే వింబుల్డన్ విజేత అవుతాడు... కప్ ను చేజిక్కించుకుంటాడు...."
"కప్పును గెలుచుకున్న నాడు నేను ... "దేవుడా ... నాకే ఎందుకింత ఆనందాన్నిచ్చావు" అని అడగలేదు.
..
<<<< ఈ కష్టం వచ్చిపడినప్పుడు "దేవుడా నాకే ఎందుకీ కష్టాన్నిచ్చావు" అని మాత్రం ఎందుకు అడగాలి?" >>>>




No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...