Monday 2 January 2017

అ స హ నం

ఎప్పుడూ ప్రశాంత వదనం తో ఉండే రంగారావు ఆ వేళ ధుమధుమ లాడుతున్నాడు.
వాకింగ్ కి వెళ్ళి వచ్చి రాగానే.. వాకిట్లో ముగ్గువేసి లోపలికి వస్తున్న బార్యతో  విసురుగా
‘’మోడి వెధవ. బోడి.. వెదవన్నర వెధవ”. అన్నాడు. ఆమె విచిత్రం గా  చూసింది.
ఇంట్లోకి వెళ్ళి  కాఫీ తెచ్చేసరికి పక్కింటి వాళ్ళ పేపర్ అందుకుని ఆబగా చదవటం మొదలెట్టాడు.
“వీడెవడో బి కామ్ లో ఫిజిక్స్ చదివాడట.. అప్రాచ్యుడు..” అన్నాడు పేపరు విసిరేస్తూ..
కాఫీ ఒక్క గుటక తాగి.. “ఇదేమిటి ఇలా ఎడ్చింది. కాఫీ వాసన ఉందా అసలు?” ఆమె వింత గా అతన్ని గమనిస్తుంటే..
ఇంట్లోంచి ఇంటర్ చదివే పిల్లాడు లేచి ఆవులిస్తూ బయటకి వచ్చాడు.
“దేశం నాశనం అవుతుందంటే అవదూ? ఏడుగంటలకా నిద్రలేవటం?” కయ్యి మన్నాడు.
వీదిలో పెద్దావిడ ఒకరు చేపలు అమ్ముతుంది. ఇంట్లోంచి టామి వాసన పసిగట్టి పరిగెత్తుకు వచ్చి తోక ఊపుతుంది.
“పొద్దుటే అప్రాచ్యపు మాటలు వినాల్సి వస్తుంది. ఇదిగో వింటున్నావా? టామి ని ఇటు లాక్కురా?”
పిల్లాడు ఆయన్ని వింతగా చూశాడు.
“దేశం బ్రష్టు బట్టి పోయింది. ఒక్కడికి కూడా బాద్యత లేదు. సమాజం అంటే గౌరవం లేదు”

పిల్లాడు తల్లి వైపు తిరిగి “ ముందు ఆ కాళ్ళకి వేసుకున్న నా షూ విప్పమను. తనవని తగిలించుకున్నట్లు ఉంది. కాళ్ళు కరుస్తున్నట్టున్నాయి” 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...