ఒక యువ చిత్రకారుడు దేవుడి బొమ్మ వెయ్యాలనుకున్నాడు.
మనసుని లగ్నం చేసుకోటానికి అతనికి ఒక ఆధారం కావాల్సివచ్చింది.
ఒక అందమయిన కల్మషం లేని పసిబిడ్డ ని అతను మోడల్ గా తీసుకున్నాడు. అతని తల్లిని ఒప్పించి కొద్ది రోజులు ఏకాగ్రత తో ఒక చిత్రం గీశాడు.
ఎంతో అద్భుతం గా దేవుని బొమ్మ తయారయ్యింది.
***
దేశ దేశాలు తిరిగి అతను గొప్ప గొప్ప చిత్రాలు గీయటం కొన సాగించాడు.
గొప్ప కళాకారుడి గా పేరు తెచ్చుకున్నాడు.
అతడి చిత్రాలు ఎంతో ఖరీదుకి కొనుక్కునే అభిమానులని సంపాదించాడు.
***
అతని కెరీర్ లో అనేక శిఖరాలు అదిరోహించాడు.
శరీరం, చూపు సహరించే లోపు ఒక దానవుని బొమ్మ గియాలని అతడు అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా.. అతనికి ఒక ఆధారం కావాల్సి వచ్చింది.
***
అత్యంత క్రూరుడయిన నరహంతకుడి ని జైలు లో కలిశాడు.
కటకటాల వెనుక ఉన్న అతన్ని చూస్తూ ఒక భీతి గొలిపే రాక్షసుడి చిత్రం గీశాడు.
అతని చివరి చిత్రం గా పేరు పొందిన దాని విలువ ఎంతో ఎక్కువగా అమ్ముడు పోయింది.
ఆ సొమ్ములో కొంత భాగం ఖైదికి దక్కాలని అతనికి అనిపించింది.
***
ఆ డబ్బు తీసుకుని చిత్రకారుడు జైలు కి వెళ్ళాడు. ఈసారి అతన్ని అతని సెల్ లో కలిసే అవకాశం దొరికింది.
అతనికి చిత్రాన్ని అమ్మిన విషయం చెప్తూ డబ్బు ఇబ్బబోయాడు.
“ రెండు రోజుల్లో ఉరి కంభం ఎక్కబోతున్నాను. నాకెందుకు?? ఈ డబ్బు”
అతను తిరస్కరించాడు.
చిత్రకారుడి ఖైదీ గాజు కళ్లలోకి బేలగా చూశాడు. అతని జాలి చూపుల నుండి తప్పించుకుంటూ
“నన్నో జ్ణాపకం కుదిపేస్తుంది. ముప్పై రెండేళ్ల క్రితం మా అమ్మ వద్ద అనుమతి తీసుకుని ఒక చిత్రకారుడు నన్ను చూస్తూ భగవంతుని బొమ్మ గీశాడట.” అతను నిర్వేదంగా అరుగు మీద కూర్చుని చేతుల్లో ' మొహం దాచుకున్నాడు.
***
'దేవుడి' నుండి 'దానవుడి' గా 'మనిషి' ఎలా మారాడు?! ఎందుకు మారాడు?!?

No comments:
Post a Comment