ఒక పఠిష్టమయిన కోటని శత్రువులు చుట్టు ముట్టారు.
శత్రువులు వేలల్లో ఉన్నారు. కోట లోపల 'రాజు' 'మంత్రి' మరి 'కొద్ది మంది సైనికులు' మాత్రమే ఉన్నారు.
చుట్టూ మోహరించిన శత్రువులని 'గవాక్షం' నుండి చూసిన రాజు గారికి చమటలు పట్టాయి.
మంత్రి దైర్యంగా ఉన్నాడు. సైనికులని పిలిచాడు. యుద్ద తంత్రం అమలు చేయటానికి సిద్దం అయ్యాడు.
రాజు గారు వణికి పోతున్నాడు. మనన్సులో విలపిస్తున్నాడు.
మంత్రి ఊరికే కూర్చో దలుచు కోలేదు. కోట లోకి రావటానికి 'ఒక్కరు' మాత్రమే పట్టే ద్వారం తెరిపించాడు.
లోపలికి వచ్చిన వారిని వచ్చినట్టు 'వధించే' టట్టు సైన్యాన్ని ఆజ్ఞాపించాడు.
ద్వారం తెరిచారు .
మంత్రి యుక్తి ఫలించింది.
శత్రువులు ఒక్కక్కరే లోనికి రాసాగారు.
లోనున్న సైనికులు శత్రువుల తలలు నరకటం మొదలెట్టారు.
శత్రువుల సంఖ్య తగ్గ సాగింది.
పరిస్తితి గ్రహించిన శత్రువులు యుద్దం విరమించి వెను తిరిగారు.
**
(రాజు కి బదులుగా వ్యక్తిత్వాన్ని, కోటకు బదులుగా క్రమ శిక్షణని, శత్రువు బదులుగా బలహీనతలనీ, మంత్రికి బదులుగా వివేకాన్ని, సైనికుల బదులుగా పట్టుదలని అనుకుని .. బలహీనతలనీ ఒక్కొక్కటిగా ఓడిద్దాం.)
No comments:
Post a Comment