ఒక బార్యా
బర్తా ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు.
సముద్రం
అల్లకల్లోలం కాసాగింది. తుఫాను మొదలయ్యింది. హోరున వర్షం. ఎగసిపడే కెరటాలు.
ఆమె
భయం తో వణికి పోతుంది. బర్త ఆమెకి రాజాయి కప్పాడు.
నీకు
భయం లేదా?
అంది.
ఎందుకు?
“పడవ
మునిగి పోతే? మనం మిగలం”
“భయపడితే
మునగకుండా నిలుస్తుందా? “
“నీకు
హృదయం లేదు”
“ఎందుకు
లేదు? అందులో
నా దేవుడు ఉన్నాడు”
అతను
పక్కకి వెళ్ళి ఒక పదునైన కత్తి తెచ్చాడు. ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె గొంతు మీద ఉంచాడు.
“నీకు భయం లేదా?” అడిగాడు.
“ఆమె
పదునైన కత్తిని చూసింది. అది పట్టుకున్న అతని చేతిని, అతని కళ్లని చూసింది”
“లేదు.”
“ఎందుకని?”
“నీ
మీద నాకు నమ్మకం”
అతను
చప్పున చేతిని వెనక్కి తీసుకుని నవ్వాడు.
“నాకూ నా దేవుడి మీద నమ్మకం”
1 comment:
best lesson/example to teach "nammakam"
Post a Comment