ఒక భారీ ఏనుగు ని సర్కస్ ప్రదర్శనకి వాడతారు. అనేక విన్యాసాలు తో వీక్షకులని కనువిందు చేస్తుంది అది.
సైకిల్ తొక్కుతుంది, ఫుడ్ బాల్ ఆడుతుంది. కాళ్ళకు కట్టిన రెండు వాహనాలని ఎంత్ర ప్రయత్నం చేసినా, కదలనివ్వని ‘బల ప్రదర్శన’ చేస్తుంది. డజన్ల కొద్ది సర్కస్ మహిళలని అవలీలగా మోస్తుంది.
విశ్రాంతి సమయాల్లో దానిని ఒక డేరాలో ఒక సన్నపాటి గొలుసు వాడి కట్టేస్తారు.
దాని నుండి విముక్తి పొందటానికి అది ఎప్పుడు ప్రయత్నించదు.
***
చిన్నప్పటినుండి దాన్ని అదే గొలుసుతో కట్టేసి ఉంచేవారు.
మొదట్లో అది గొలుసుని తెంపుకొటానికి ప్రయత్నం చేసేది. దాని బలం సరిపోయేది కాదు.
అనేక మార్లు విఫలమయ్యేది. తన వల్ల కాదని భావన తో దాని ఆలోచన నిండి పోయింది.
ఈ సంకెళ్ళను తెంచుకోవటం సాధ్యపడదు అని అది నిర్ణయించుకుంది.
**
ఇప్పుడది బాగా పెద్ద దయింది. చాలా పుష్టిగా బలంగా తయారయింది.
చిన్న ప్రయత్నం తో ఆ గొలుసుని ఛేదించ గలదు. కానీ అది అలాటి ప్రయత్నం చేయదు.
ఎందుకంటే ‘నాకు ఇది అసాధ్యం’ అనే భావన దాని బుర్రలో ఘనీభవించింది. పోరాటం మానేసింది.
**
సంకెళ్ళు అనేవి మానసిక బలహీనతలు. వాటిని తెంచుకోగలను అనే నమ్మకాన్ని మనం కోల్పోవటమే అసలయిన బలహీనత.
No comments:
Post a Comment