Wednesday 4 January 2017

సంతోషం

శిష్యుడు గురువు వద్దకి చేరాడు. 
పాదాల చెంత కూర్చున్నాడు. గురువు శిష్యుని అంతరంగం గమనించాడు.
“ఏం కావాలి నాయనా??”
“నాకు సంతోషం కావాలి” 
గురువు శాంతంగా ఏది ఆ పలక మీద వ్రాయి అన్నాడు.
శిష్యుడు వ్రాశాడు.
“నాకు సంతోషం కావాలి “
ఇప్పుడు మొదటి పదం తుడిచెయ్యి. నేను / నాకు అనేవి ఆహానికి సంభందించినవి.
ఇప్పుడు ఏమి మిగిలింది.
“సంతోషం కావాలి”
‘కావాలి’ అనేది కోరిక / కామం దానిని తుడిచెయ్యి.
శిష్యుడు గురువు చెప్పినట్లు చేశాడు.
 ఇప్పుడు నీవు కోరుకున్నది దొరికింది కదా? ఎవరయినా ఆహాన్ని, కోరికని తొలగించుకుంటే మిగిలేది సంతోషమే నాయనా.
శిష్యుడి మొహం లో వెలుగు నిండింది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...