Sunday, 29 January 2017

‘విరక్తి’ ని మించిన సంతృప్తి లేదు.

ఒక విలువయిన ది బౌతికమయినది మనకి అందుబాటులోకి వచ్చినప్పుడు. సమాంతరంగా ఒక ‘భావం’ మనం పెంపొందించుకోవలసి ఉంటుంది. 
నా జీవితం లో అత్యంత ప్రియమయిన నా తండ్రి బౌతికంగా నన్ను వీడి పోతున్నాడని తెలిసినప్పుడు ఆ భావమే నన్ను ఆయన మరణానంతరం కాపాడింది. లేకుంటే నా గుండె పగిలి పోయి ఉండేది. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. 
ఆ ‘భావమే’ ‘విరక్తి/నిరాశ’ 
జీవితం లో ఎంతో ప్రణాళిక చేసుకుని ఒక ఇష్టమయిన వస్తువు (car/మొబైల్/ఫ్లాట్) కొంటాము. దాని ఉపయోగం కంటే అది మనవద్ద ఉన్నది అనే భావన మనన్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది. దాని పట్ల విపరితమయిన ప్రేమ/ బిలాంగినెస్స్ పెంపొందించుకుంటాము. అలాటి ఒక బౌతీక వస్తువు లేదా వ్యక్తి పట్ల ఎంతో ప్రేమ ని మనం నిర్మించుకుంటూ వస్తాం. దాని/ వారి ఉనికి లేని జీవితాన్ని ఊహించుకోవటం కూడా కష్టం అవుతుంది.
ఒక దురదృష్టకరమయిన రోజు హటాత్తుగా అది మనన్ని విడిపోతే??
మన ప్రేమకి సమానమయిన నష్టం మనకి జరుగుతుంది. అది దుఖాన్ని మించినది. ‘వేదన’ అని అనొచ్చు.
గాలి నిండిన బెలూన్ లాటి మనసు మీద అది పదునయిన సూది తో పొడుస్తుంది. మనం ప్రళయ సమానమయిన కుదుపుకి లోనవుతాం. మెదడు మొద్దుబారి పోతుంది. మరే ఆలోచన మనకి తోచదు.
అలాటి ఆకస్మిక సంఘటనల నుండి కాపాడు కోవాలంటే మనం “నిరాశ’ ని సమాంతరంగా పెంపొందించుకోవాలి.
ఇది వస్తువు - దీనిని ఇంతగా ప్రేమించడం తగదు. ఇది డబ్బు- మనిషి సృష్టించుకున్నది. దాని విలువ కొంత పరిది దాటాక శూన్యం అయిపోతుంది. ఇతను నా బార్య/బర్త /బిడ్డ/ తల్లి /తండ్రి – ఏదో ఒక రోజు నన్ను వీడి నాటకీయంగా వెళ్ళి పోతాడు/తుంది. అనేదాన్ని మనం వీలయినంత లోపలికి తీసుకోవాలి.
ఒక నిరాశ ని సమాంతరంగా పెంపొందించుకోవాలి.
12 ఏండ్ల పిల్లాడు పిల్లాడికి ఐరన్ బాక్సు పట్టుకున్నప్పుడు షాక్ కొడుతుంది. అతడి చేతిలో ఆ వస్తువు ఇంకా అలానే ఉంటుంది. దాన్ని పట్టుకున్న పిల్లాడు చిగురుటాకులా వణుకుతూ ఉంటాడు.
అల్లారుముద్దుగా పెంచిన బిడ్డ. పాల బుగ్గల నునుపు ఇంకా మాయం కానివాడు.
మనమేం చేస్తాం. “అయ్యో ..నా బిడ్డ” అని కూలబడి పోతాం. లేదా మనం కూడా వాడి చెయ్యి పట్టుకుని గుంజుతాం.
రెండిటి వళ్ళా మనకు జరిగేది ఇంకా ఎక్కువ నష్టం.
వీలయినంత త్వరగా పరిస్తితి మనసులోకి తీసుకోగలిగేతే, మైన్ వద్దకి పరిగెత్తి ఆపటం లేదా ఏదయినా కర్ర సాయం తో పిల్లాడి చేతి మీద కొట్టటం చేయాలంటే.. మనం పెంచుకున్న ఈ నిరాశే/విరక్తే  మనని ప్రేరేపిస్తుంది. మనలని పూర్తి నష్టం నుండి కాపాడుతుంది.
ఇంట్లో గిద్ద బియ్యం వంటలో తగ్గించాల్సి రావటం అనేక కుటుంబాలని బజార్లో పడటం నాకే కాదు మీకు తెలుసు.
ఒక ప్రణాళిక లేకపోవటం, నా తర్వాత అనే ఆలోచన అన్నీ ఉన్నప్పుడూ చెయ్యక పోవటం. మనం చేసే ఆర్ధిక ఒడంబడికలు భాగస్వామితో పంచుకోక పోవటం. ఎక్కువగా మనం చేసే పొరపాట్లు.
అలాగే ఆరోగ్యం విషయాలు భాగస్వామితో చెప్పక పోవటం, క్రమమయిన జీవన విధానాలని అవలంబించక పోవటం కూడా మనం చేసే తప్పులు.
కుటుంబం లో సబ్యులు అందరూ తమ బాద్యతలు తెలుసుని ప్రవర్తించాలి. ఆరోగ్యమయిన స్వచ్చని అనుభవిస్తూనే కాలం తో పాటు గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.
 వాహనం లో బరువుని అన్నీ చక్రాలు సమంగా పంచుకుంటే ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది.
వస్తు ప్రేమ, వ్యక్తి ప్రేమ కి సమాంతరం గా ఒక 'వాస్తవం తో కూడిన ఆలోచన ' ని పెంపొందించు కున్నప్పుడే మన జీవితాలని తల్లకిందులు చేసే  కుదుపులు ఉండవు.
విరక్తి’ ని మించిన సంతృప్తి లేదు.

మిక్సీ

యదావిదిగా మనాడిమీద ఆవిడకి పిచ్చ అనుమానం. 
తను ఊర్లో లేనప్పుడు ఇంటిపట్టున ఉండకుండా తొట్టి బాచ్ ని వేసుకుని సాయంత్రాలు క్లబ్ లలో జల్సా చేస్తాడని.
అత్యవసర ఆస్తి పనుల మీద ఆవిడ ఊరు వెళ్లాల్సి వచ్చింది. 
ఊరెళ్ళిన సాయంత్రం ఫోన్ చేసింది. “ఏమండీ .. ఏం చేస్తున్నారు?”
“మా ఫ్రెండ్ వ్రాసిన ‘పోలీసు డాగ్’ కధ చదువుతున్నాను. “
“నిజమా? ఏమి అనుకోకండి. ఇక్కడికి వచ్చా గాని అన్నీ మన ఇంటి జ్ణాపకాలే. వంట గదిలోకి వెళ్ళి మన మిక్సీ ఒక్క సారి ఆన్ చేయండి. దాని సౌండ్ వింటే అయినా నాకు నిద్ర పడుతుందేమో “
మనాడు వెళ్ళి ఆపని చేసి ఫోన్ దాని పక్కనే ఉంచాడు. “వినబడిందా”
“ఆ. ఇక నిద్ర పొతాను . గుడ్ నైట్”
ఆవిడ మరో వారం ఉండాల్సి వచ్చింది. రోజు ఇదే తంతు.
తీరా పనయ్యాక బావమర్ది ఉర్నుండి కారు వేసుకుని వచ్చి ఆవిడని సాయంత్రం ఇంట్లో దిగబెట్టాడు.
ఇల్లు తలుపువేసి ఉంది.
న్యూస్ పేపర్లు వరండాలో ఓపెన్ చేయకుండా దర్శనం ఇచ్చాయి. వారం నుండి కసువు ఊడ్చినట్టు కనిపించలేదు.
తన దగ్గర ఉన్న తాళం లో డోర్ లాక్ తీసి లోపలికి వచ్చిందావిడ.
వంటింట్లో మిక్సీ లేదు.
Happy Sunday. Good Morning :D

Saturday, 28 January 2017

గుడ్ బాయ్

మార్కెట్ లో కలిసిందావిడ..
ఒక వయసు దాటాక పిల్లల గురించి మాట్లాడుకోవటం ఇష్టం గా మారుతుంది.
ఇద్దరు ఆ వయసులోనే ఉన్నారు. 
“మా వాడు వాళ్ళ నాన్న గారు ఎంత కొప్పడినా గడ్డం గియ్యడండి.” అంది కవిత 
 “మా పిల్లాడు రెగ్యులర్ గా షేవింగ్, డిప్ప క్రాఫు కంపల్సరీ” రెండో ఆవిడ.
“ఆడపిల్లల నుండి ఫోన్లు మాకు తెలియదనుకుంటూనే మాట్లాడుతుంటాడు” నవ్వింది కవిత.
“మా పిల్లాడు మూడేళ్లనుండి, ఆడపిల్లల ని అసలు చూడనే లేదు. ఇంకా మాట్లాడే అవకాశం ఎక్కడ? వాట్స్ అప్, ఎఫ్‌బి లు అసలు వాడడు. ఇంకా చెప్పాలంటే సెల్ కూడా వాడికి ఇష్టం ఉండదు. ?”
కవిత రెండో ఆవిడని అసూయగా చూసింది.
ఇంతలో కవిత కొడుకు మొదటి ఉద్యోగం తో కొనుక్కున్న లక్షన్నర బండి మీది మార్కెట్ బయట నిలబడి ఉండటం గమనించి పిల్లాడి దగ్గరకి వచ్చింది.
“ అమ్మా నువ్వు మార్కెట్ కి వచ్చావని నాన్న చెప్పారు. ఇటే వెళ్తున్నా గదా అని ని కోసమే చూస్తున్నాను”
పరిచయం అయిన ఆవిడకి “ మా అబ్బాయి” పరిచయం చేస్తూ చెప్పింది.
“ఓ ఆంటీ నాకు తెలుసు.. బావున్నారా? మీ అబ్బాయి వచ్చేవారం పెరోల్ మీద వస్తున్నాడ..టగా?”
:p :p :D

Thursday, 26 January 2017

తప్పదు !

ఇంటావిడ పుట్టిన రోజు, అత్త, మామ, బామార్ది పుట్టిన రోజులు, 
పెండ్లి రోజులు, తేదీలు చెప్పి ఒక బొకే షాపు వాళ్ళకి చెక్ ఇచ్చేశాడు 
ముందు జాగర్తగా బర్త. 
ఠంచనుగా ఆ తేదీల్లో ఆ షాపు వాళ్ళు ఉదయాన్నే పూల బొకెని, 
చాక్లెట్ పాకెట్నీ, ముందుగా ఈయన గారు వ్రాసి ఇచ్చిన ‘with love.. yours.. (తిక్కల సన్నాసి)’ అన్న కార్డు ముక్కని ఇంటికి వెళ్ళి ఇంటావిడకి ఇచ్చేట్టు ఒప్పందం. 
**
ఏ వ్యవస్థ అయినా కొన్నాళ్లు బాగానే నడుస్తుంది.
***
నిన్న సాయంత్రం ఇంటికి వచ్చాక సోఫాలో టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ బొకే లో ఉన్న తాజా పూల కొమ్మల్ని చూసి.. “ఏమిటోయ్ విశేషం? ఎవరయినా అతిదులు వచ్చారా?” అని అడిగాడు ట.
..
ఆడేవడో అన్నట్టు టైమ్ అండీ టైమ్.
..
ఇవాళ కుడికాలు బారంగా లాగి నడుస్తూ ఇందాకే మార్కెట్ లో కనిపించాడు

Wednesday, 25 January 2017

గొంతు నొప్పి

నిన్న ఒక కుగ్రామం లోకి వృతి రీత్యా వెళ్లినప్పుడు ఒక జ్ణాపకం కలియబెట్టింది.
..
చాలా కాలం క్రితం సుమారుగా పద్నాలుగు, పదిహేను ఏళ్ళయి ఉంటుంది.
కురిచేడు మండలం లో నాయుడుపాలెం గ్రామం లో ‘కృష్ణ’ అని ఒక ‘RMP’ ఉండేవాడు.
..
అతను మా లబ్ధిదారుడు. ఇంటినుండి తీసుకువెల్లిన కారేజ్ వాళ్ళ ఇంట్లో కూర్చుని తింటున్నాను.
..
అప్పుడు కృష్ణ ఇంటివద్ద లేడు. డిగ్రీ చదివే కుమార్తె, డాక్టరమ్మ అని పిలవబడే ఎప్పుడు స్కూల్ కి వెళ్లని ఆర్‌ఎం‌పి భార్య ఇంట్లో ఉన్నారు.
..
ఒక స్త్రీ ఏడాది లోపు పిల్లని బుజాన వేసుకుని వచ్చింది.
ఎలాటి ఆందోళన కానీ, భయము కానీ ఆమె ముఖం లో లేవు.
వాటిని మించిన శూన్యం, దైన్యం తో మునిగి ఉంది.
..
బుజాన ఉన్న బిడ్డని దించింది. బిడ్డ స్పృహలో లేదు.
డాక్టరమ్మ బిడ్డ పొట్టమీది చర్మాన్ని రెండు వేళ్ళతో పట్టుకుని లాగి వదిలింది. అంటుకున్నట్టు అయిన రెండు పొరలు సాదారణం కావటానికి కొంత సమయం పట్టింది.
డీహైడ్రేషన్ అని కొద్ది దూరం లో కూర్చుని ఉన్న నాకు అర్ధం అయ్యింది.
..
“ఈయన లేడు. పిల్లని కురిచేడు తీసుకువెళ్ళు. పరిస్తితి బాలేదు.” డాక్టరమ్మ చెప్పింది.
..
“ఇప్పుడంత డబ్బులు నాదగ్గర కూడా లేవు. నువ్వే ఏదో ఒక సీసా (సెలైన్) కట్టు”
..
“పసిపిల్లకి నరం దొరకటం కూడా కష్టం. నా దగ్గర కూడా సీసాల్లేవు. కురిచేడు వెళ్ళటమే మంచిది.”
..
“ ఈ మడిసి బెల్దారు పనులకి వెళ్ళి రెండు నెలలయ్యింది. పైసా పంపింది లేదు. ఇంటికి వచ్చింది లేదు. నా దగ్గర డబ్బులేదు. నువ్వే ఏదన్నా చెయ్యి” అందామే.
..
కొద్దినిమిషాలు డాక్టరమ్మ నచ్చ చెప్పి ఆమెని బలవంతాన పంపేసింది.
..
డాక్టరమ్మ నా దగ్గర కి వచ్చి మరో చెంబుతో తాగే నీరు ఇస్తూ.. "ముగ్గురు పిల్లలు ఇలానే పోయినా వెంకమ్మ తీరు మార లేదు.” ఆంది.
అన్నం పూర్తిగా తినకుండా డబ్బా సర్దుకున్నాను. గొంతు నొప్పి మొదలయ్యింది.

Friday, 20 January 2017

లోపలే ఉంది

ధైర్యం, సాహసం, నమ్మకం, ముందుచూపు, ఆత్మ విశ్వాసం నూరి నూరి నింపాడు. 
ఆ తరువాత బ్రహ్మకి భయం పట్టుకుంది.
వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో.....
కాబట్టి వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు.
"నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద.

"మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు. ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు." అన్నాడు బ్రహ్మ.

"పోనీ ... నేను నీటి అట్టడుగున దాచేస్తాను," అంది చేప.
"
మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు."
"
నేను నేల పొరల్లో దాచేస్తాను." అంది ఎలుక.
"
మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు."
అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది. 
"
సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం....." అంది.
"
భేష్.... మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు. అన్నిటినీ గెలుస్తాడు. కానీ తన లోపలికి వెళ్లలేడు. తనను తాను గెలవలేడు. అక్కడే దాచేద్దాం," అన్నాడు బ్రహ్మ.
అప్పటి నుంచీ బలం తన లోపలే ఉంది. కానీ మనిషి బయట వెతుకుతూనే ఉన్నాడు.
(రాకా లోకం నుండి) 

Wednesday, 18 January 2017

కుల్ ధరా - 1825 - ఆత్మగౌరవం

ఎడారి మార్గం లో పోతూ ఉంటాం. మండు టెండ ..
ఉన్నట్టు ఉంది ఒక ఊరు దూరంగా కనబడుతుంది. ఆశగా దగ్గరకి వెళ్తాం
మేడలు, మిద్దెలు, విశాలమయిన చావడీలు, వీదులు, కూడళ్ళు .. అన్నీ ఉంటాయి.
కానీ ఒక్క నర ప్రాణి  కూడా కనిపించరు.
అప్పుడు ఎలా ఉంటుంది?? ఒక్క సారి ఊహించుకోండి.
వీధుల్లో శూన్యం.. ఇళ్ళల్లో శూన్యమే .. ఎక్కడా అలికిడి లేదు సవ్వడి లేదు..
అలాటి శ్మశాన ప్రశాంతి క్షణమయినా తట్టు కోగలమా?
ఒకటి రెండు కాదు ఏకంగా 84 గ్రామాలు. 191 ఏళ్లుగా ఇలాగే నిశాబ్దంగా, నిర్జనంగా, నిజీవంగా నిలబడి శిధిలమయి పోటు ఉంటే. కడుపులో ఎలా ఉంటుంది. మెత్తటి తల్లి పేగుని ఎవరో పదునయిన గోరుతో గీకుతున్నట్టు లేదా?
అయితే ఇంకా చదవండి.
84 గ్రామాలు ఒకప్పుడు అమృత గ్రామాలు. జవం జీవం తో ఉట్టిపడిన గ్రామాలు.
ఇప్పుడు ప్రాణం పోయి మిగిలిన కళేబరాలు,, ప్రజలు విడిచిన ఖాళీ గూళ్ళు
అయితే వీటి వెనక ఒక కమాందుడి నిరంకుశం ఉంది.
గ్రామాలు వాణిజ్యానికి, వ్యవసాయానికి పట్టుకొమ్మలు. ఎడారిలోనూ బంగారం పండించే వారు అక్కడి ప్రజలు. వ్యాపారంలో పట్టిందల్లా బంగారంగా మార్చేవారు. జైసల్మేర్ మహారాజులకు అత్యధిక ఆదాయం గ్రామాల నుంచే వచ్చేది. అందుకే రాజులకు గ్రామాలంటే అమిత గౌరవం. సమృద్ధి నిండిన గ్రామాల్లోని ప్రతి ఇల్లూ ఒక సౌధమే. అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇంట్లోనే సువిశాలమైన దేవిడీలు, పెద్దపెద్ద స్నాన ఘట్టాలు .... ఇలా అతులిత వైభోగంతో అలరారేవి. ఎనభై నాలుగు గ్రామాలదీ ఒకే మాట. ఒకే బాట....
జైసల్మేర్ రాజుగారి మంత్రి 'సలీం సింగ్' కి 84 గ్రామాలన్నిటికీ పెద్దగా వ్యవహరిస్తున్న ఆయన కూతురుపై కన్నుపడింది. పరదాలు, ఘోషాలను చీల్చుకుని మరీ చూడగలిగే కళ్లుంటాయి కాముకులకి.
సలీం సింగ్ కళ్లు కూడా అందాల బొమ్మను చూశాయి. నరాలు జివ్వుమన్నాయి. చెట్టుకున్న పువ్వును చూసి సంతోషపడేవాళ్లు కొందరు. దాన్ని దేవుడి పాదాల ముందుంచి తృప్తిపడేవారు కొందరు. గౌరవంగా తలలో తురుముకుని ఆనందించేవాళ్లు కొందరు. కానీ 'సలీం సింగ్' పువ్వును తుంచి, ఒక్కో రేకూ తుంపి, కాలికింద మట్టగించి పాశవిక ఆనందం పొందే రకం.

అమ్మాయిని జైసల్మేర్ లోని తన హవేలీకి పంపించమన్నాడు. లేకపోతే 'పన్నుపోటు' పెరుగుతుందన్నాడు. బతుకు దుర్భరం చేస్తానన్నాడు. తెల్లవారే సరికి మేనాలో అమ్మాయి రావలసిందేనన్నాడు.


తెల్లవారింది....
అమ్మాయి రాలేదు... సలీం సింగ్ తన మనుష్యులని పంపించాడు.
ఆశ్చర్యం..
కానీ ఎనభై నాలుగు గ్రామాల్లో ఒక్క నరపురుగు లేదు. ఇళ్లు ఖాళీ అయిపోయాయి. రాత్రికి రాత్రికి అంత సంపద నిచ్చిన ఆవాసాలను వదిలేసి అందరూ మాయం. సలీం సింగ్ కి తమ అమ్మాయినిచ్చి శాశ్వతంగా అవమానపు చీకట్లో ఉండే కన్నా అర్థరాత్రి ఆత్మగౌరవపు వెలుగును వెతుక్కుంటూ వెళ్లిపోయాయి ఊళ్లు.
ఊరు పోయింది.
కాడు మిగిలింది. ఇప్పుడు చెప్పండి. మెత్తటి తల్లి పేగుని ఎవరో పదునయిన గోరుతో గీకుతున్నట్టు లేదా?
తెల్లవారి వెలుగులో ఖాళీ గ్రామాలను చూసి తెల్లబోయాడు సలీంసింగ్.
సంఘటన 1825 లో జరిగింది.
అప్పట్నుంచే జైసల్మేర్ పాలకుల ఆదాయం తగ్గింది. ప్రభ కూడా తగ్గింది. సలీంసింగ్ అవమానంతో హవేలీకి పరిమితమయ్యాడు. ప్రజల ముందుకు మళ్లీ రాలేకపోయాడు.
ఖాళీ ఇళ్లలో వేరేవాళ్లని చేర్చేందుకు పాలకులు ప్రయత్నించారు.
కానీ శవానికి ట్యూబు ద్వారా ఆక్సిజన్ పంపితే ప్రాణం వస్తుందా?

ఊరొదిలి వెళ్లే ముందు 84 గ్రామాల ప్రజలు ఉమ్మడిగా " పాడుబడిన ఊళ్లో రాత్రి నిద్ర చేసిన వాళ్లకి మళ్లీ మెలకువ రాకూడదు" అని శాపం పెట్టారు. ఒకరిద్దరు సాహసం చేసినా శవాలై  తేలారు.
అప్పట్నుంచీ గ్రామాలు శవాలై , రాచరికానికి స్మశానాలుగా  నిలిచిపోయాయి.







84 గ్రామాలలో నివసించిన పాలీవాల్ బ్రాహ్మణులు ఎక్కడికి పోయారో, ఏమైపోయారో ఎవరికీ తెలియదు. గుజరాత్ లో ముస్లింల అత్యాచారాలు తప్పించుకునేందుకు పాలీ ప్రాంతం నుంచి 1291 లో వాళ్లు జైసల్మేర్ కి వచ్చారు. 524 ఏళ్ల తరువాత సలీం సింగ్ పుణ్యమా అని జైసల్మేర్ నీ వదిలిపెట్టారు.

వాళ్ల ఆత్మగౌరవానికి, కులగౌరవానికి ప్రతీకగా వాళ్ల గ్రామాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. జైసల్మేర్ కి 18 కి.మీ దూరంలో ఉన్న గ్రామాల్లో ఒక గ్రామం పేరు కుల్ ధరా.... అదిప్పుడు ఒక టూరిస్టు స్పాట్. అక్కడి గోడలు, మేడలే కాదు, ఆత్మగౌరవం కోసం అన్నీ వదులుకున్న పాలీవాల్ కులస్థుల కథ కూడా టూరిస్టులను అబ్బురపరుస్తూ ఉంటాయి.


www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...