ఇంగ్లండ్
లో ఐ సి యస్ డిగ్రీ చదివిన భారతీయ యువకుడు ఒకరు ఉత్తర ప్రదేశ్ లోని ఇటావా జిల్లా కలెక్టర్ గా ఉండేవాడు.
ఆగ్రా
నుండి ‘యునైటెడ్ ప్రొవిసన్స్ ఆఫ్ ఇండియా’ కి కమిషనర్ గా పనిచేస్తున్న
విన్సెంట్ ఆర్థర్ స్మిత్, పర్యవేక్షణ నిమిత్తం కలెక్టర్
గారి హెడ్ క్వార్టర్స్ కి వచ్చారు. పాశ్చాత్య పద్దతులు పూర్తిగా ఎరిగిన కలెక్టర్
గారు ఆయనని గౌరవించడానికి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశాడు.
స్మిత్
గారికి బోజనమ్ లో ఆయనకి అత్యంత ప్రియమయిన వంటకం మొదటగా వడ్డించగానే.. ఒక్క క్షణం ఆయన దానిని చూసి పక్కకి నెట్టేశాడు.
కలెక్టర్
గారికి ఆశ్చర్యం వేసింది.” మీకోసం ప్రత్యేకంగా చేయించాను. దానిని గుర్తుపట్టలేదా?? పక్కకి నెట్టేశారు?” అన్నాడు.
అతను
మెల్లగా “నాకు తెలుసు. గుర్తుపట్టాను” అన్నాడు
“మీకు
ఇష్టం లేదా?” అడిగాడు కలెక్టర్.
“ఇష్టమో
లేదో వేరే విషయం. ఇక్కడ భారత దేశం లో ‘ఆవుని’ మాత గా
పూజిస్తారు. ఈ దేశం లో ఉన్నంత కాలం నేను ఈ ప్రజల మత విశ్వాసాలని గౌరవించడం నా
విది. నేను అంత అనాగరికుడిని కాను” అన్నాడు.
కలెక్టర్
గారు సిగ్గుతో తలెత్తుకోలేక పోయారు.
*****
Sir Vincent Arthur Smith, (1848–1920) గ్రేట్ బ్రిటన్ & ఐర్లాండ్ యునైటెడ్ కింగ్ డమ్ లో జన్మించారు. 23 వయసుకి
ఇండియన్ సివిల్ సర్వీసెస్ పాసయ్యాడు. 1871-1900 మద్య కాలం లో యునైటెడ్ ప్రొవిసన్స్
ఆఫ్ ఇండియా కి కమిషనర్ గా పనిచేశాడు.
తిరిగి
ఇంగ్లాండ్ వెళ్ళి పోయాక భారతదేశం గురించి, గొప్ప రాజుల గురించి అనేక గ్రంధాలు వ్రాశాడు
(The Early History of India and The Oxford History of India, Buddhist
emperor, Ashoka and the Mughal emperor, Akbar, and a history of fine arts in
India and Ceylon ఆయన వ్రాసిన వాటిలో కొన్ని )
No comments:
Post a Comment