దసరా
కి పుట్టింటికి వెళ్ళిన బార్య బర్త కి పంపిన
వాట్స్ అప్ మెసేజ్ లోని కొంత బాగం.
**
పనిమనిషికి జీతం ఇచ్చేశాను. దారళంగా దసరా మామూలు ఇవ్వక్కర్లేదు. నేను ఉరినుండి వచ్చిందాకా
పనిమనిషి వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది.
**
10 రోజులు వైఫై ఆపెయ్యమని ప్రొవిడర్ కి చెప్పేశాను. పెండలాడే పడుకోండి. మీ external HDD కేబుల్ కోసం వెతక్కండి. అది నా తో పాటు హాండ్ బాగ్ ఉంది.
**
మీరు చాలా హెల్తి గా ఉన్నారు. మాటి మాటికి ఆ లేడి డాక్టర్ వద్ద చెకప్ కి వెళ్లవద్దు.
**
మీ కోతి మూకని పోగు చేయకండి. సోఫాలో సిగిరేట్ పొడిని, పోయిన సారి క్లీన్ చేసుకోటానికి
రెండు రోజులు పట్టింది. పిజ్జా బిల్లు లు చాలా దొరికాయి.
**
మీ మరదలు పుట్టిన రోజు పోయిన నెలలోనే అయిపోయింది. మనిద్దరం వెళ్ళి వచ్చాం. అర్ధరాత్రి
వెళ్ళి దానికి బిలేటెడ్ బర్త్ డే విశేస్ చెప్పాల్సిన పని లేదు. మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడట.
అది మీకోసమే అని నా నమ్మకం.
**
పక్కింటి వాళ్ళని పొద్దుటే లేపి పేపర్ వచ్చిందా, పాలు వచ్చాయా అని విసిగించకండి.
**
అర్మారాలో కుడి వైపు మీ చడ్డీలు ఉన్నాయి. ఎడంవైపు ఉన్నవి పిల్లాడివి. ఆఫీసునుండి ఏదో
ఇబ్బందిగా ఉంది అని పోయినసారి హడావిడి పెట్టారు గుర్తుందా?
**
మొబైల్ ఫోన్ బాత్రూమ్ సోప్ బాక్స్ లో పెట్టి ఇల్లంతా రెండు రోజులు వెతికారు పోయినసారి.
కళ్ళజోడు ఫ్రీడ్జ్ లో ఉంది పోయింది.
**
మరి అంత ఎక్కువ స్మార్ట్ గా ఆలోచించకూ. మన బజార్లో ఉండే మిసెస్ జానకి, కనకం నవనీతం ముగ్గురు
ఊర్లో లేరు.
**
షరా మామూలుగా నేను ఎప్పుడయినా తిరిగి వచ్చే అవకాశం ఉండనే ఉంది.
*** హాపీ దసరా
No comments:
Post a Comment