నిస్ప్రయోజనమయిన
ఒక అదికారిక మీటింగు పూర్తి అయ్యే సరికి సాయంత్రం 7.30 దాటింది.
అప్పటిదాకా
బిగబట్టుకు కూర్చున్న రెండు వందల పైగా అదికార్లమి పోలోమని బయటకి వచ్చాం.
మా
పెద్దమ్మాయి కి ఫోన్ చేసి “ నాన్నా నేను వస్తున్నాను. బయటకి తీసుకెళ్లి నీకు డ్రస్
కొనిస్తాను. నీ పుట్టినరోజుకి” అని చెప్పాను.
నా
టు వీలర్ తీస్తుంటే, మా దూరప్రాంతం వెళ్లాల్సిన మా కొలీగ్ ఒకరు లిఫ్ట్ అడిగాడు. అతడికి బి పి, సుగర్ లాటి దగ్గర మిత్రులు ఉన్నారు. ఈ మద్యే స్పైనల్ నొప్పి మొదలయ్యిందని
చెప్పాడు.
బస్
స్టాండ్ వైపు అతన్ని దించడానికి వెళుతుంటే.. దారిలో చర్చి సెంటర్ వద్ద, “ఇవన్నీ జరిగే పనేనా మీటింగులో
చెప్పిన టార్గెట్స్ అందుకోగలమా?” అన్నాడు బాధగా.
బండి
అపాను. “చూడు కోటి (కోటేశ్వర రావు) నువ్వు ఇప్పుడు కోటేశ్వర రావువి. అదికారి చొక్కా
అక్కడే వదిలేయ్యి. రేపు ఉదయం ఆఫీసులో కూర్చున్నప్పుడు వేసుకో. ని స్వంత టైమ్ ని కుటుంబానికి, సన్నిహితులకి లేదా నీ స్వంతానికొ లేక ఇష్టమయిన వ్యాపకానికో వాడుకో. ఆఫీసులో ఉన్నప్పుడూ టైమ్ ని పూర్తిగా ఉద్యోగానికి
వాడుకో. రెండు మిక్స్ చేసుకుని కాక్ టైల్ జీవితం
గడపకు. ఆరోగ్యం ఇంకా పాడవుతుంది.”
అతన్ని
బస్ స్టాండ్ లో వదిలి వచ్చేస్తుంటే.. “#33grade పోస్ట్ ల లో నువు వ్రాసిన compartmentalization ఇదే కదా? అన్నాడు. "దీన్ని నేను కనీసం పదేళ్ళ క్రితం వంటబట్టించుకుంటే బావుండేది.
ఒకే థాంక్ యు “
No comments:
Post a Comment