మండు
వేసవి. పెటేల్మని ఎండ. మిట్ట మద్యాన్నం. ఆ యువ సన్యాసి ‘టారి గేటు ‘ స్టేషన్
లో దిగి నేలపై ఒక సంభాన్ని అనుకోని కూర్చుని ఉన్నాడు. ఎండ నిప్పులు చెరుగుచున్నది.
సన్యాసి వద్ద ఎటువంటి నగదు లేదు. అతనికి అమితమయిన ఆకలి గాను,
దాహం గాను ఉంది.
ఒక
ధనవంతుడు ఎదురుగా కూర్చుని మంచి ఆహారం తీసుకుంటూ సన్యాసిని చూసి “అన్నపానీయాలు లేకుండా
మాడుటే సన్యాసుల గతి “ అని హేళన చేశాడు. ఆ
యువ సన్యాసి ఆ వాక్యాలని స్వీకరించలేదు.
అంతలో
ఒక మిటాయి దుకాణాదారుడు, రుచి కరమయిన బోజనాన్ని చల్లటి మజ్జిగను తీసుకుని వచ్చి సన్యాసి ఎదుట ఉంచి “స్వామి వీటిని
భుజించండి” అని బ్రతిమాలాడు.
ఆ
సన్యాసి అతనితో “ మీరెవరు? నాకు మీరు పరిచయం లేదు. మీరు మరెవరో అనుకుని బ్రమపడి నావద్దకు వచ్చినట్లున్నారు
“ అని బోజనం తీసుకోకుండా తిరస్కరించాడు.
దానికా
వర్తకుడు “ స్వామి! నా ఇష్ట దైవమయిన శ్రీ రామ చంద్ర ప్రభువు నాకు కలలో కనిపించి, రైల్వే స్టేషన్ లో ఉన్న
మిమ్ములను చూపించి ‘అదిగో అతను నిన్నటి నుండి అతడు ఆహారం లేకుండా
ఉన్నాడు. నా మనసు తల్లడ్డిళ్ళు తుంది. వెంటనే ఆహార పానీయాలను తీసుకు పోయి అతనికి అందచేయుము’ అని ఆదేశించి యున్నాడు.”
నేను
నిద్ర నుండి మేలుకుని ‘ఇది కలే కదా అని నిర్లక్షం తో మళ్ళీ నిద్ర కి ఉపక్రమించాను. మళ్ళీ అదే ‘కల’ ఎవరో తట్టి లేపినట్లు అయినది. ఆయన ఆజ్ఞానుసారము ఈ
బోజనం తీసుకు వచ్చాను. ఖచ్చితంగా మిమ్మల్నే శ్రీరామ చంధ్ర ప్రభువు నాకు చూయించారు.
దయచేసి వీటిని స్వీకరించండి” అని ప్రాదేయ పడ్డాడు.
పరమేశ్వరుని
లీలకు ఆశ్చర్యముతో కన్నీరు విడుచుచూ సన్యాసి
ఆ వర్తకుని కి కృతజ్ఞత తెలిపి వాటిని స్వీకరించాడు.
ఎదురుగా కూర్చుని ఉన్న దనవంతుడు సన్యాసి పాదముల పట్టుకుని తన మూర్ఖత్వాన్ని క్షమించమని
వేడు కున్నాడు.
“ఎవరు
ఇతర చింతలు లేకుండా నన్నే ఉపాసింతురో వారి యోగ క్షేమములు లకు నేను బాద్యత వహించేదను
“ అని గీతలో శ్రీకృష్ణుని పలుకులను ఆ దనవంతునికి సన్యాసి అయిన వివేకానందుడు గుర్తు
చేశాడు.
No comments:
Post a Comment