Friday, 1 April 2016

డాక్టర్ పిల్ల

ప్రతిరోజూ లాగానే అప్పారావుకి కాలేజీ నుండి మెసేజ్ వచ్చింది. కుమార్తె 
మెడికల్ ఎంట్రన్స్ కి లాంగ్  టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న పౌల్ట్రీ కాలేజీ నుండి.
***
D/p your ward G.Geetika .. Today Grand Test 5 exam marks
138/160 (1) first in whole campus.
***
అప్పారావు కి మనసు దూదిపింజయి పోయింది. ఎప్పుడు రెండు అంకెలు దాటని పిల్ల హటాత్తుగా క్యాంపస్ ఫస్ట్ ప్లేస్ వచ్చేందంటే ..
అమ్మాయి డాక్టర్ అయిపోయినట్టు, మెడలో సేతస్కోపు వయ్యారంగా తిప్పుకుంటూ స్వంత హాస్పిటల్ లో వరండా లో నడుస్తున్నట్టు.. ఎన్నో ఊహలు ..
***
పదిన్నరకి క్యాంపస్ నుండి పోన్ వచ్చింది.
"
సర్ అప్పారావు గారా? మీ అమ్మాయి ఫీజు బకాయి ఇంకా 43000 ఉంది సార్. ఈ మద్య డిల్లీ నుండి కొత్త లెక్చర్స్ ని తెప్పించాము. పిల్లల్లో మంచి ఇంప్రూవ్మెంట్  ఉంది."
..
"
ఇప్పుడే బాంకి కి వెళ్తున్నాను. కాలేజీ అకౌంటు లో వేస్తాను."
ఏప్రిల్ 1 బాంకు రద్దీగా ఉన్నా మొత్తానికి అప్పారావు అప్పు తీర్చేశాడు.
**
సాయంత్రం మరో మెసేజ్ .
sorry for the morning messege. 
D/p your ward G.Geetika .. Today Grand Test 5 exam marks
38/160 (1) first from last in whole campus.
thanks for paying all dues. 
***
Happy April first.  హ హ 






No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...