Tuesday, 5 April 2016

కోటీస్ షాపింగ్ మాల్

ఒక నడివయస్సు అతను, కొడుకుతో కలిసి 42 డిగ్రీల గ్రీష్మం లో బాపూజీ కాంప్లెక్స్ పార్కింగ్ లాట్ లో నుండి బండి తీసి ఫర్లాంగు వచ్చాడో లేదో బండి చైన్ తెగి పోయింది.
..
ఇస్లాంపేట మొదట్లో చాలా మెకానిక్ షాపులు ఉన్నాయి. మరో పర్లాంగ్ లోపు దూరం లో ఉన్న మెకానిక్ షాపు కి తండ్రి కొడుకులు బండి నెట్టుకు వెళ్లారు. లేటుగా లంచ్ కి వెళ్ళిన కుర్రాళ్ళు ఇంకా రానందున ఒక గంట సమయం పడుతుందని, బండి ఉంచి గంట తర్వాత రమ్మని తెలిసిన మెకానిక్ చెప్పాడు.
..
తండ్రి కొడుకులు దగ్గర్లో ఉన్న కోటిస్ షాపింగ్ మాల్ కి వెళ్లారు. 
గ్రౌండ్ ఫ్లోర్ లో ఏ‌సి పోకుండా ఎయిర్ కట్టర్ ఉంది. 
దాని కింద రెండు నిమిషాలు నిలబడ్డారు అప్పటికి కానీ తడిచిన చొక్కాలు ఆరేలేదు. 
కౌంటర్ ముందు తెల్లటి టైల్స్ మీద పువ్వులతో పెద్ద ముగ్గు వేసి ఉంది.
..
మద్యాహ్నం టైమ్ అవటం తో జనం పలచగా ఉన్నారు.
..
నాలుగంతస్తుల షాపింగ్ మాల్ లో లిఫ్ట్ లో తిరుగుతూ అంతా కలియతిరిగారు. 
బేబీ టాయ్స్, నుండి వాక్యూమ్ క్లీనర్ల వరకు అన్నీ చూశారు, ధరవరలు విచారించారు.
 క్రోకరీ డిజైన్స్ అన్నీ ఒక్కొక్కటి ముట్టుకుని చూశారు. 
పిల్లాడు ఎలెక్ట్రానిక్ బిభాగాన్ని, గేమ్స్ వస్తువులని, 
తండ్రి ఫర్నిచర్ ని హౌస్ హోల్డ్ వస్తువులని నఖశిఖ పర్యంతం విచారించారు. 
ప్రతి ఫ్లోర్ లో ఉంచిన కూలింగ్ వాటర్ గ్లాసులు నింపుకుని తాగారు. 
లిఫ్ట్ లో పైకి కిందకి చెరో రెండు సార్లు తిరిగారు.
..
కౌంటర్ లో కూర్చుని సెక్యూరిటీ కామ్ లో  ఏమి కొనకుండా కాంప్లెక్స్ అంతా కలియ దిరుగుతున్న ఇద్దరినీ గమనించిన మేనేజర్ కౌంటర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి పెద్దాయనని కలిసి అడిగాడు.
...
 మీకేం కావాలి సార్ ?” వినయం పలికి నప్పటికి “ఎందుకొచ్చారు?” అని దాని భావం.
..
“అనాసిన్ టాబ్లెట్ కావాలి. అది కూడా డాక్టర్ రెడ్డీస్ లాబ్ లో జనవరి 16 తేదీ తయారయినది“ పెద్దాయన చక్కటి ఇంగ్లీష్ లో చెప్పాడు. 
ఈ లోగా ఆయన కొడుకు కూడా అక్కడి వచ్చాడు. “ప్లాస్టిక్ స్పూన్ లు డజను సెట్ ఇస్తారట. ఒక్కొక్కటి ఇవ్వటం కుదరదట?” తండ్రి తో చెప్పాడు ఆ పిల్లాడు.
..
మేనేజర్ ఒక్క నిమిషం అయోమయంగా చూసి ఇద్దర్ని అనుమానంగా చూశాడు.
ఇద్దరు నాగరికుల లాగానే ఉన్నారు. 
వాళ్ళు కావాలనే అలా బిహేవ్ చేస్తున్నట్టు మేనేజర్ కి క్షణాల్లో అర్ధం అయింది.
..
“అసలేమయింది సార్ ? “ మర్యాద గా అడిగాడు.
..
“గుడ్. యు గాట్ ది పాయింట్ “ ఒక్క గంటకే ఇరిటేటింగా ఉందా మీకు ?” జేబులోంచి సెల్ తీశాడు. లాక్ తీసి మెసేజెస్ ఓపెన్ చేసి కోటిస్ లో కొనమని వచ్చిన కమరిషియల్ మెసేజ్ లు చూయించాడు.
..
“ అప్పుడెప్పుకో అప్పడాల కర్ర కొన్నప్పుడు ఫోన్ నెంబరు రాసుకుని నాలుగేళ్ళు నుండి నెలకి 12 చొప్పున అయిదొందల సార్లు కి పైగా  మెసేజ్ లు పంపుతున్నారు. మాకేలా ఉంటుంది.??”  Grrrrrrrrr


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...