Friday, 15 April 2016

తల నొప్పి

అపార్ట్మెంట్ లో తరచూ బాత్రూమ్ లో టాప్స్ బ్లాక్ అయిపోతున్నాయి.
..
సర్విస్ యెరియా నుండి బక్కెట్టు తో నీళ్ళు పట్టుకుని ప్రతిసారి బాత్రూమ్ కి వెళ్లాలంటే చాలా సమస్యగా ఉంటుంది. ..
పైగా వెర్టిఫైడ్ టైల్స్ ఫ్లోరింగు. చుక్క నీళ్ళు పడ్డా జారీ పడటం ఖాయం. 
నడుములు విరగటం డబుల్ ఖాయం. 
..
స్వంత ఫ్లాట్ కాబట్టి ఎవర్ని నిందించడానికి లేదు. ..
అన్నిటికి ఆ బిల్డర్ ని తిట్టుకోటం మినహా. 
పనివాళ్ళకి మహానగరం లో మహా కరువు. చెయ్యను అని చెప్పరు. చెయ్యరు. 
'
ఇదిగో వస్తున్నా' అంటే ఆర్నెలలు. ఫోన్ చేస్తే తియ్యరు. తీసినా 'వీది మలుపులో ఉన్నాను వచ్చేస్తున్నాను' అంటారు. నత్తలు కూడా వచ్చేస్తాయి వాళ్ళు రారు.
...
అలాటి పరిస్థితులలో ఆదివారం పొద్దుటే ప్లంబర్ తలుపు తట్టి వచ్చేసరికి సుబ్బారావు ఉక్కిరి బిక్కిరయ్యాడు....
..
ఉపోద్ధాతం లేకుండా "అసలు నా తలనొప్పి గురించి చెబుతాను" మొదలెట్టాడు సుబ్బారావు. 
..
"
మీ ఆవిడ గురించి నాకెందుకు సార్. ప్లంబింగ్ రిపేరు ఏమిటో చెప్పండి"
పిల్లాడు త్రివిక్రమ్ శిష్యుడు . ..
Love

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...