Wednesday, 20 April 2016

అట్ల తద్ది

."ఇవాళ ఏం రోజో మీకు గుర్తుందా? "
..
బ్రేక్ పాస్ట్ లోకి అతనికి పెసరట్టు ఉప్మా చేసి పెట్టింది ఆవిడ...
..
ఓ ఎందుకు గుర్తు లేదు?" నవ్వాడతాను ..
..
"ఖచ్చితంగా గుర్తుండదు" ఆమె నమ్మకంగా చెప్పింది...
..
"చూస్తావుగా?"
***
11 గంటలకి ఒక డోర్ బెల్ మోగింది. ఒక కుర్రాడు వచ్చి ఒక పూల బొకే ఇచ్చి వెళ్ళాడు.
"roses to my darling" అని బర్త చేతి రాత తో రాసిన స్టిక్కర్ ఉంది.
***
3 గంటలకి ఒక పార్సిల్ వచ్చింది. అందులో తన కి సరిపడే ఒక మంచి ఖరీడయిన డ్రస్ ఉంది" మళ్ళీ ఒక నోట్. " to my dearest" అని..
**
4.30 మళ్ళీ బెల్ మోగింది. జయాలూకస్ నుండి ఒక గిఫ్ట్ పాక్ .
డైమండ్ పెండెంట్ & to my lovely wife అని నోట్ కూడా ఉంది.
***
8 గంటలకి బర్త వచ్చాడు. ఎర్రటి బుగ్గల్తో బ్రూ కాఫీ ఇచ్చింది.
"అట్లతద్దికి బార్యకి ఇన్ని పంపారంటే నెక్స్ట్ వీక్ బర్త్ డే కి మరెంత సర్ ప్రైజ్ చేస్తారో"
అతన్ని చెవిలో చెప్పింది.
**
అబ్బాయికి కాఫీ పొరబోయింది.


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...