Sunday, 24 April 2016

పార్టు -2 ..(రేగు పళ్ళు)

పార్టు -2 ..(రేగు పళ్ళు)
సైకిలు గురవారెడ్డి గారి అబ్బాయిది కాబట్టి, 
సామాజిక న్యాయం ప్రకారం ఆ అబ్బాయిని ఎక్కించుకుని అడ్డ తొక్కుడు తొక్కుకుంటూ స్కూల్ కి చేరాడు. రోశయ్య ..
..
తన క్లాస్ రూముని చిమ్మి, బోర్డు ని శుబ్రంగా పాత గుడ్డతో కుట్టిన సంచి తో తుడిచి అయ్యవారి బెంచీ మీద రెండు బెత్తం పుల్లలు విరిచి సిద్దంగా ఉంచడం చిన రోశయ్య పని.
..
పంతులు తెలుగు పద్యాలు చెప్పెటప్పుడు రోశయ్యకి ఎక్కడ లేని ఉత్చాహమ్ గా ఉండేది. శ్రావ్యమయిన పధ్యాలు మదురంగా పాడి, టీకా తాత్పర్యం తో సహా చెబుతుండే వాడు. అంతే శ్రావ్యంగా రోశయ్య కూడా బట్టి వేసినట్లు చెప్పేవాడు. 
ఎటొచ్చీ లెక్కలే అతని ప్రాణానికి ఒక పెద్ద గుదిబండ లాగా తయారయ్యాయి. 
స్కూల్ లో మరో అయ్యవారి కొడుకు సుదర్శనం ఉండే వాడు అతను లెక్కల్లో ఘనాపాటి ఎంతపాటి వడ్డీ లెక్కనయినా, బాగస్వామ్య లెక్కలయినా, 
లాబనష్టాల లెక్కలయినా అలవోకగా చేసేవాడు. 
..
ఔటు బెల్లు కొట్టాక సుదర్శనం రోశయ్య క్లాసులో ఒక మూల చేరారు. ..
రోశయ్య తన పుస్తకం లో రాత్రి కిరసనాయిలు దీపం ముందు కూర్చుని పెన్సిల్ తో చేసిన లెక్కలు సుదర్శనం కి చూయించాడు. 
..
రేగు పళ్ళు తెచ్చావా?” 

తెచ్చాను” ..

మరి ఇవ్వు

జేబులోంచి అమ్మ మల్లమ్మ ఇచ్చిన రేగుపళ్లు పొట్లం అలానే సుదర్శనానికి ఇచ్చాక అతని లెక్కల్లో తప్పులు సరిచేసి, ఎలా చెయ్యాలో చెప్పాడా పిల్లాడు. 
..
పొట్లం  విప్పి దొర రేగ్గాయ తొడిమ పట్టుకుని తింటూ.. 
బలే ఉన్నాయిరా. నువ్వు తిన్నావా?” అడిగాడు. 

..
రోశయ్యకి నోట్లో నీళ్ళు ఊరాయి.
తిన్నాను చెప్పాడు...

..
మద్యాన్నం కుండలో నీళ్ళు సత్తు చెంబు తో తీసుకుని వెళ్ళి ..
చెట్ల నీడన కూర్చుని కారేజి విప్పగానే ఒక గిన్నె లో చిక్కటి మజ్జిగ పోసిన కొర్ర అన్నం, పై గిన్నెలో సంకటి రోటి కారం తో పాటు చిన్న బెల్లం ముక్క ఉండటం గమనించాడు రోశయ్య. బెల్లం ముక్కని తీసుకుని గబాల్న బుగ్గన వేసుకుని, సంకటి తినడం మొదలెట్టాడు. 
..
మద్యాన్నం స్కూల్లో ఉన్నప్పుడు, తమ పంతులు కోసం ఎవరో వచ్చారు. ..
అయ్యవారు బయటకి వెళ్ళి వచ్చి తనని లేపి "ఒరేయ్ నువ్వు ఇంటికెళ్ళారా, గురవరెడ్డిగారి అబ్బాయి కూడా? సైకిలు వేసుకుని జాగర్తగా వెళ్ళండి." 
..
బడి గంట కాకుండా ఎందుకు ఇంటికి వెల్లమంటున్నాడో అర్ధం కానీ రోశయ్య తనేమయినా తప్పు చేశాదేమోనని భయం భయం గా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ....
మీ నాయన పేరు గురవయ్య కదా? నువ్వు వెంటనే ఇంటికెళ్లు. ..

సైకిలు ఉన్నవాడిని తోడు తీసుకుని వెళ్ళు
.
రోశయ్యకి ఏమి అర్ధం కాలేదు. పుస్తకాల సంచీ సర్దుకున్నాడు. .
లేచి క్లాసు బయటకి వస్తూ .పంతులు గారు బోర్డు మీద రాసిన పద్యం మరో సారి చదివాడు. 
..
క్షంతకుఁ గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ
హంతకు నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్...
..
ఇంటికి చేరేంత వరకు ఇద్దరు ఏమి మాట్లాడుకోలేదు. ..
రజానగరం వాగు దగ్గరకి వచ్చేసరికి సైకిలు కి తగిలించిన సంచీ కాడ తెగిపోయింది. దాన్ని నెత్తిన ఉంచుకుని సైకిలు వెనుక పరిగెట్టుకుంటూ తుర్.. తుర్.. మని లారీ శబ్దం చేస్తూ గాందీ బొమ్మ వద్దకి చేరేసరికి ఒక కొత్త వాతావరణం అక్కడ గుమిగూడి ఉంది. దారిలో తారసపడ్డ వాళ్ళు తనని ప్రేమగా చూడటం, 
కాదు మరేదో గా చూడటం రోశయ్య గమనించాడు. 
..
అల్లంత దూరాన ఉన్న మండువా పెంకిటిల్లు అరుగుమిద జనం గుమి గుడి ఉన్నారు.
కలికాలం కాకుంటే ఎరువు దిబ్బలో నలకిందాసు కరిస్తే ఇంత అవుతుందని అనుకుంటామా?” దూరంగా ఉన్న వాళ్ళు మాట్లాడుకోవటం రోశయ్యకి వినబడుతూనే ఉంది. .
..
మద్యలో ఎవరో పడుకుని ఉన్నారు చుట్టూ బందువులు ఉన్నారు.. 
వీళ్ళేవరూ కాదు అమ్మ పెద్దగా ఏడుస్తుంది, 
అన్న కూడా, చెల్లెలు తమ్ముడు మాత్రం పెద్దమ్మ వాళ్ళ చంకలో ఎక్కి ఉన్నారు. 
వాళ్ళ బుగ్గలు మకిలిగా ఉన్నాయి. 
..
అరె రోశయ్యా ఎల్లి పోయాడ్రా.. మీ నాయనఅంటూ తల్లి మళ్ళీ శోకం లో మునిగి పోయింది. 

(ఇంకా ఉందా?)


No comments: