Sunday, 10 April 2016

లైఫ్ రిస్క్ మాజిక్

విజయవాడ హోటల్ M లోఉన్న మినీ కాన్ఫరెన్స్ హల్లో షో ముగిశాక, 
అక్కడే బస చేసిన ప్రముఖ మెజీషియన్ ని అప్పారావు అతి కష్టం మీద కలిశాడు .
**
"మీ షో లు చాలా చూశాను. మనిషిని రెండుగా విడదీస్తారే 

ఆ మాజిక్ అంటే నాకు చాలా ఇష్టం "
**
"అది చాలా క్లిష్టమయిన మాజిక్ " మజిషియన్ చెప్పాడు.
**
"
దాని సీక్రెట్ రివిల్ చెయ్యరా? ప్లీజ్ "
**
*
వద్దు.. లైఫ్ రిస్క్ ఉంటుంది అందులో. 
అనుభవం లేకుంటే ప్రాణం కూడా పోవచ్చు"
**
"
అయితే మా ఆవిడకి చెప్పండి. 
తన దగ్గర నేర్చుకుంటాను " 
కొద్ది సేపు ఆగి చెప్పాడు అప్పారావు. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...