పెద్ద ఖర్మ అయ్యాక,
బోర్లించిన వెదురు బుట్ట కింద వెలిగించిన మట్టి ప్రమిద పక్కన
తెల్ల చిర లో కూర్చున్న తల్లి ని చూడటానికి పెద్ద పిల్లలిద్దరికి కి ఎందుకో మనస్కరించలేదు.
ఆరడుగుల ఎత్తు, సన్నగా దృడంగా
ఉండే పెద్ద రోశయ్య ని చూసిన వాళ్ళెవరూ అతనికి పదహారు మాత్రమే నిండాయని చెబితే
నమ్మరు.
మల్లమ్మ కి అతనే ఇప్పుడు ఆశాదిపం.
మల్లమ్మ కి అతనే ఇప్పుడు ఆశాదిపం.
మరో రెండువారాలు గడిచాక పెద రోశయ్య వచ్చి తల్లికి చెప్పాడు
“నేను ముఠా పనికి వెళ్తాను”
బజార్లో లారీల్లో వచ్చిన సరుకు దించడానికి. ఎత్తడానికి హమాలీల ముఠా ఉంటుంది. ఒక గ్రూప్ గా ఉండే పనివారు సాయంత్రానికి వచ్చిన కూలి సమానంగా పంచుకుంటారు.

పిల్లాడిది ఆ వయసు కాదని మల్లమ్మకి తెలుసు.
కాని మరో మార్గం లేదు.
ఆమె అంగీకారం కోసం పెద రోశయ్య చూడలేదు.
ఎవరి ద్వారానో తల్లి ఈ విషయం వినటం ఆ పిల్లాడికి ఇష్టం లేదు.

ఆ రాత్రి, సంధ్య ముగిసే టప్పుడు పెద్ద రోశయ్య 12 అణాల రోజు కూలి
ని తల్లి చేతిలో ఉంచినప్పుడు ఆమెకి కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి.
అప్పటికే ఆమె రైతుల జీవాలని(పశువులు) కొండకి వెళ్లి మేపుకు రావటానికి సిద్దపడి ఉంది.
..
ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై?
ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం
బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా
డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !!..
..
(గజేంద్ర మోక్షం. నీటిలోని మొసలి, దాహం కోసం సరసులోకి డింగిన గజరాజు పాదాన్ని నోట కరచినప్పుడు, గజరాజు శ్రీ మహా విష్ణువుని కాపాడ రమ్మని వేడుకునే సన్నివేశం)..
..
చిన రోశయ్య తన మొలతాడుకి కట్టుకున్న చిల్లి కాణిలు రెండు విప్పి తల్లి కి ఇచ్చాడు,
“నేను రోజు వెండి పట్టాలు మెరుగు పని రాత్రి పూట చేస్తానమ్మా షావుకారు జీతం ఇస్తానన్నాడు. కాని చదువు కుంటా నమ్మా. గురవారెడ్డి గారి అబ్బాయి ‘ముండ కొడుకువి’ నా సైకిలు ఎక్కొద్దు అంటున్నాడు. నేను రోజు స్కూల్ కి నడిచి అయినా వేళ్తానమ్మా” అన్నాడు.

ఆమె పిల్లలిద్దరిని దగ్గరకి తీసుకుని బోరున ఏడ్చింది.
పేద రోశయ్య చొక్కా విప్పి ఎర్రగా కమిలిన వీపుకి కొబ్బరి నూనె లో సున్నపు తేట కలిపి రాసింది.
వళ్ళంతా తడుముతూ వెక్కి వెక్కి ఏడిచింది.
మిగిలిన పసివాళ్ళు ఏమయిందో అర్ధం కాక తోడుగా తల్లిని కరుచుకుని ఏడవసాగారు.
ఇంట్లో ఏమి జరుగుతుందో వాళ్ళకి అర్ధం అయ్యే వయసు కాదు.
చిన్న పిల్ల బాగ్యం అయితే ఆటమద్యలో
"నాయిన ఏడి?”
అని అడుగుతుండేది. మల్లమ్మకి సముదాయించడం కష్టమయ్యేది.

మర్నాడు ఉదయం తల్లి
పెద్ద అంచు ఉన్న కంచు పళ్ళెం లో అన్నకి సంకటి వడ్డించడం చిన రోశయ్య దృష్టి ని దాటి పోలేదు.