ఒక లోకల్
ట్రైన్ లో ప్రయాణించే మహిళ మీదకి తూలిన ఒక 50 ఏండ్ల పోలీస్ అదికారినుండి ఆమె చాకచక్యంగా తప్పించుకుంది. అతను వెనక్కి
తూలి పడి లేవలేక పోయాడు.
..
ఆ మధ్య నెట్ లో
'షరాబి పోలీస్'
పేరిట హల్చల్ చేసిన కొద్ది క్షణాల నిడివి ఉన్న వీడియో అది.
..
అతని సంజాయిషీ
కొరటం, అది రాక ముందే సస్పెన్షన్ వెంటనే జరిగిపోయాయి.
...
జీవితం లో
మత్తు పదార్ధాలు వాడని అతనికి సేరిబ్రల్ హెమరేజ్ (మెదడు కి రక్తాన్ని
సరఫరా చేసే రక్త నాళాలు పగిలిపోవటం) పార్షియల్ పరాలసిస్ హటాత్తుగా ఎందుకొచ్చిందో
అతని కుటుంబం తో పాటు డాక్టర్స్ కి అంతు పట్టలేదు. ట్రైన్ లో తల తిరిగి బాదతో
అల్లాడిపోతూ ఏ ఆధారం దొరక్క వెనక్కి పడి పోయినప్పుడు తలకి అయిన గాయం ఆర్నెళ్ళ
పాటు అతన్ని బాదించింది.
అంతకన్నా
ముఖ్యంగా సోషల్ నెట్ వర్క్ లో తాగుబోతుగా హల్చల్ చేసిన వీడియో క్లిప్.
...
నిజం మందంగా
ప్రయాణిస్తుంది కాబట్టి అతడికి లేటుగా న్యాయం జరగొచ్చు జరగక పోవచ్చు అది వేరే
విషయం.
క్షణాల్లో
జడ్జిమెంట్ ఇచ్చేయటం, మాటలతో కుళ్లబోడవటం మాత్రం మనందరికీ చాతనయింది. సోషియల్ మీడియా
పాత్ర కూడా చాలా సార్లు సమాజానికి అంతులేని ప్రమాదం . :(
ఇందులో మన పాత్ర ఎంత??
No comments:
Post a Comment