Sunday 27 March 2016

నాగరికత అంటే సుఖంగా తిని తిరగటమా?

నీటిని ఎంత సమర్దవంతంగా వాడుకోవచ్చో మనం, కేవలం 700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం 55 లక్షల జనాబా ఉండే సింగపూరు నుండి నేర్చుకోవచ్చు. మలేషియా నుండి ఒప్పందం ప్రకారం 'జోహర్' నది నుండి వచ్చే అరా కోరా నీరే దాని ప్రధాన వనరు (2061 తో ఒప్పందం ముగుస్తుందట). భూమి మీద పడ్డ మూడింట రెండు వంతుల నీటిని రిజర్వాయిర్లకు మళ్ళిస్తుంది.
..
మురుగు నీటిని శుద్ది చేసి' newater' పేరుతో తిరిగి వినియోగిస్తున్నారు. దీని వాటా ప్రస్తుతం 10 శాతం నుండి 30 శాతానికి పెంచే ప్రయత్నం లో ఉన్నారు. సముద్ర జలాల నుండి కొంత మంచి నీటిని తయారు చేస్తున్నా దాని ఖర్చు ఎక్కువ. ప్రపంచ దేశాలకి ‘జలం మూలం ఇదం జగత్’ అనే పాఠాన్ని ఎప్పటి నుండో నేర్పే ప్రయత్నం చేస్తుంది. సింగపూర్ కి గ్లోబల్ హైడ్రో హబ్ గా పేరు ఉంది...
..
మనం, మన ప్రబుత్వాలు, మీడియా, సమాజాన్ని ప్రభావితం చెయ్యగల బాబాలు, మేదావులు, సినీ హీరోలు వ్యర్ధమయిన కూల్ డ్రింకుల తాగటం గురించి, పెళ్లి కి ముందు సంభందాలు లాటి చెత్త మాటలు మానేసి బాద్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది...
..
ప్రధానంగా మనం ఎదుర్కుంటున్న సమస్య ‘నీరు’
..
నీటికి కరువు ఎంత ఎక్కువగా ఉంది అని చెప్పడం లో మీడియా ఎప్పుడూ ముందే ఉంది. ఇప్పుడు సమస్య ఎవడి బూతద్దం పెద్దది అనేది కాదు. ..
సమస్యకి సోల్యూషన్ / జాగర్తలు /ముందుచూపు అవసరం . ఇప్పటికే మనం మన తర్వాత తరాల వారి నీటిని వాడుకుంటున్నాము. చిత్తు కాగితాలు వాళ్ళకి మిగిల్చే ఆరాటం లో ఉన్నాం .
నిజానికి వారికి మనం ఇవ్వ వలసింది వనరులు అది ప్రధానంగా మంచి గాలి/ నీరు .
..
మన రోజు వారి పనుల్లో / జీవితం లో నీటిని ఎంత తక్కువ ఖర్చు చేశాం? ..
ఎంత పొదుపు చేశాం? అనే రెండు రెండు అంశాల ను సదా గుర్తుంచు కోవాలి.
దాహం అయ్యాక భావి తవ్వటం అనే నానుడి మనకి అందరికీ తెలుసు.
ఇప్పుడు తవ్వుదామన్నా లోతు అనంతం. ..కన్నీళ్ళూ తప్ప నీటి చుక్క కనబడకపోవచ్చు frown emoticon
..
మనం మన పిల్లలకి కేవలం డబ్బు/భూమి/నగలు / చదువు ఇస్తే చాలా? మరేమీ అక్కర్లేదా? ఒక్క నిమిషం సీరియస్ గా ఆలోచించండి.
ఇంకుడు గుంతలనీ, కంటూర్ తవ్వకాలని కేవలం డబ్బు పిండుకోటానికి వాడుకున్నాం అప్పట్లో....అలా కాకుండా సమర్ధవంతంగా చిత్తశుద్దితో చేసినట్లయితే పరిస్తితి ఇంత దారుణంగా ఉండక పోవచ్చు.
..
ఇప్పుడు పొలాల్లో నీటి నిలవ సామర్ధ్యం పెంచుకోటానికి గుంటలు తీసుకోమని, వాటికి నగదు సాయం చేస్తామని ప్రభుత్వం ముందు కొచ్చింది. ప్రతి విషయాన్ని నెగెటివే గా ఆలో చించడం మానేయ్యాలి. ..
..
ఉన్న కొద్ది స్థలం లో గ్రౌండ్ ఫ్లోర్ లో భూభాగం (un floored) ఎక్కువ ఉండేట్టు చూసుకోండి. పార్కింగ్ టైల్స్ లాటి వాటితో కప్పెట్టి నీటి ఇంకుడు కి అవకాశం లేకుండా చేయకండి. ప్రతి బోర్ పాయింట్ వద్ద/ చుట్టూ నీటి ఇంకుడు ఏర్పాట్లు చేసుకోండీ...
...
వాడుక నీటిని, ఇంకుడు గుంటల్లోకి లేదా చెట్ల పాదికీ వెళ్ళే ఏర్పాటు చేసుకోండీ. పల్లెల్లో చాలామంది పిల్లలకి నులక మంచం మీద స్నానాలు చేయించి కింద పెట్టిన మరో పాత్రలో వాటిని పట్టి మళ్ళీ మరో అవసరానికి వినియోగిస్తున్నారు.
....
వాళ్ళ కి ఉండే కామన్ సెన్స్ మనకి ఉండటం లేదు.
నాగరికత అంటే మనం సుఖంగా తిని తిరగటం కాక పోవచ్చు.
మన జాతికి సమాదానం చెప్పాల్సిన బాద్యత మనందరికీ ఉంది.
...
ఈ రోజు మనం నీటి వృదాని ఎంత తగ్గించాము? ...
రేపటి కోసం ఏమి చేస్తున్నాము అని రోజు మనన్ని మనం ప్రశ్నించుకుందాం 






No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...