Thursday, 24 March 2016

హోలీ వెళ్లింది


లాంగ్ జర్నీచెయ్యటం కోసం వేసవి కదా అని ఖరీదయినా ఏసీ బస్ ఎక్కుతాం.
బస్ లో చాలా మంది మగాళ్లు 'తీర్ధం' పుచ్చుకుని బస్ ఎక్కుతారు. వాళ్ళ అలవాటు వారిది. నానా నాన్ వెజ్ తింటారు. ముంత మసాలాలు తింటూ ఎక్కుతారు. కొంతమంది ముదుర్లు దమ్స్  అప్ బాటిల్లో తయారు చేసుకున్న ద్రవాలు, అల్లం పచ్చడి, మంచింగ్  పోట్లాలు బస్సులోనే కానిస్తుంటారు. నోరు తెరిస్తే మార్కెట్ గుర్తుకొస్తుంది. ఇక విచిత్రమయిన శబ్దాలతో గురకలు మొదలవుతాయి. పరీక్షలో కాపీ కొట్టినట్టు ఎవరో చుట్ట పీలుస్తుంటారు. ఆ గబ్బు బస్సులో మూసిన కిటికీల మధ్య గింగిరాలు తిరుగుతూ ఉంటుంది. రక రకాల ఆల్కాహాలు, తిండి పదార్ధాల చండాలపు వాసన కొనసాగుతూ ఉంటుంది.
అన్నీ మూసేసి 'ఏసీ' వేసి,
పౌరులు సమాజం లో ఎంతో బాద్యతగా ఉంటున్నారో ఒక విగ్గున్న వారసత్వపు హీరో, కూతురి కన్నా చిన్న వయసున్న పిల్ల పిర్ర మీద చరుస్తు చెప్పే సినిమా ఒకటి టి‌వి లో వస్తుంటుంది. బస్సు సిటీ దాటుతుంది.


నిద్ర పట్టి పట్టనట్టు ఉంటుంది. ఒక పెద్దావిడ కాళ్ళు వాఛి బాద పడుతుంటుంది. మొదటి సారి పుట్టింటికి వచ్చే గర్బిని పిల్ల అసౌకర్యంగా కదులుతూ ఉంటుంది. జర్నీ అలవాటు లేని ఒకావిడ అత్యంత బాదాకరంగా వాంతి ని ఆపుకోటానికి ప్రయత్నిస్తుంటుంది.


తెల్లవారుజామున అందాకా గురక పెట్టిన  పేగులు రెండో వైపు పని చేయటం మొదలవుతాయి. క్లోజ్డ్ బస్సులో ఆ గాలి గిరికిలు కొడుతుంది. ఎవరో వాంటింగ్ చేసుకుంటారు. అది 'ఎండి' పోవాల్సిందే గాని ఎప్పటికీ కడగని RTC బస్సు లో ప్రయాణం సురక్షితం అని టి‌వి లో ప్రకటన వేస్తుంటారు. కానీ ఎవూరు దగ్గర్లో ఉన్నామో  మాత్రం ఎవరూ చెప్పరు..


దిగి ప్రాణాలు కాపాడుకుని తర్వాత నడిచి వెళ్దామా అని పిస్తుంది. పక్కనే కూర్చున్న ఒక పెద్దావిడని, జర్నీ పడని ఒక పిల్ల అడుగుతుంది. "ఇది ఎవూరు ఆంటీ ?" అని.
రెండు కళ్ళు ముక్కుమీదకు తెచ్చి ఆవిడ అంటుంది

"హోలీ నిన్ననే అయిపోయింది గా"

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...