ఎర్రటి ఎండలో ఎప్పుడో ఒక ఆటొ తప్ప ఏ
వాహనము తిరగని మట్టి బాట వెంట
డ్యూటీ లో బాగంగా టూ వీలర్ మీద వెళ్తూ ఉంటే ఒక కాకి నిక్కరు వేసుకున్న అతను ఉన్న ఒక్క చేతిని ఎత్తి లిఫ్ట్ అడిగాడు.
మాసిన అతని చొక్కాని, మురికిగా ఉన్న నిక్కరు ని చూసి, నాలుగు కొలోమీటర్ల దూరం వెళ్ళి.. పోయిన పని చేసుకుని బయలు దేరబోతుంటే, వెనక టైరు ఫ్లాట్ అయి ఉంది.
30 కుటుంబాలు మించని అతి చిన్న హాబీటేషన్ అది. కొద్ది మంది ఇంటికి కాపలా ఉన్న ముదుసలి వాళ్ళు తప్ప మరెవరూ కనబడలేదు. ఒక అంగన్వాడీ టీచరు, ఉన్న నలుగురు పిల్లల్తో కాలక్షేపం చేస్తుంది.
సహజంగా ఇలాటి పరిస్తితులలో గుర్తుకు వచ్చే అనుకూలమయిన ఒక ఛోటా నాయకుడు గుర్తొచ్చాడు. ఫోన్ తీశాను. సిగ్నల్ లేదు.
టైమ్ మద్యాన్నం 1.30 దాటింది. దాహం మొదలయ్యింది. ఆకలి గుర్తుకొస్తుంది.
నడిచి వెళ్లాలన్న తారు రోడ్డు కి కనీసం రెండు గంటలు నడక ఉంది.
ఒక ఎండిపోయిన వేపచెట్టు కి కట్టిన అరుగు మీద, నీటి చుక్క రాని బోరింగు పక్కన కూర్చున్నాను. అరగంట గడిచింది.
అంగన్వాడీ టీచరు ఒక పిల్లాడిని పంపి నాసరయ్య ని పిలిపించింది.
అతను వస్తూనే నన్ను చూసి నమస్కారం పెట్టాడు.
వెనుక టైర్ ని సైకిలు టిబు తీసినట్లు తీసి స్టిక్కర్ వేసి సైకిలు పంపు తో గాలి కొట్టి రెడీ చేశాడు. దేవుడు ఇలాటప్పుడే గుర్తొస్తాడు ..
నేను పర్సు తీసి ఇవ్వబోతున్న వందని వంటి చేత్తో తిరస్కరించాడు.
"మా ఊరు వచ్చే అదికార్లే తక్కువ. వచ్చిన వారు ఇబ్బంది పడకూడదు" అన్నాడు.
నాసరయ్య నిక్కరు చొక్కా మాత్రమే మురికిగా అనిపించాయి.
చెప్పుల్లో దూరిన కాళ్ళ వెళ్ళు లెక్కపెట్టుకుంటూ బండి స్టార్ట్ చేశాను.#susri

No comments:
Post a Comment