Sunday 20 March 2016

ఒక మొద్దు బాబు ని చూశాను


రాత్రి కర్లపాలెంలో పని చూసుకుని తిరిగి బయలు దేరేసరికి మా ఇద్దరికీ టైం  పది దాటింది.
10-30 కి బాపట్ల లో ఆ టైమ్ లో కూడా తిండి దొరికే హిందూస్థాన్ హోటల్ కి ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన సందులోకి వెళ్ళి బండి పార్క్ చేసి కూర్చున్నాము. 

..
చిన్న హోటల్ నాన్ వెజ్ కి ప్రసిద్ది. పుల్కాలు కాజు కర్రీ ఆర్డర్ చేశాం...
.. 
మా గ్లాస్ టేబుల్ ఎదురుగా ఒక తడి బాచ్ తులుతూనే, ..
నాన్ వెజ్ వంటకాలు కెలుకుతున్నారు. చంద్రబాబుకి రుణమాఫీ మీద ఒకరు ఉపన్యాసం, సలహాలు ఇస్తున్నాడు. 
హోటల్ యజమాని లౌక్యంగా వారి సంభాషణ వాల్యూమ్ ని తగ్గించే ఏర్పాటు చేస్తున్నాడు. 
..
మేం చాలదేమోనని చెప్పిన ఎగస్ట్రా టమోటా కర్రీ మిగిలి పోయిందని ..ఎగస్థ్రా పుల్కాలు చెప్పాం. 
తీరా అవి వచ్చాక, మార్చి ఆఖర్లో ఖర్చు పెట్టాల్సిన కేంద్ర నిదుల్లాగా 
బలవంతాన లోడ్ చేస్తున్నాం. 
..
ఈ లోగా ఎదురు టేబుల్ వాళ్ళ గెలుకుడు పూర్తి అయ్యింది. 
అందులో ఒక పొడవాటి, మొద్దు కుర్రాడు కౌంటర్ నుండి రెండు ప్లాస్టిక్ కవర్ తెప్పించుకుని, మిగిలిన బిర్యానీ అన్నాన్ని, మాంసం ముక్కల్ని వేరుగా చేసి అందులోకి మార్చాడు. అడిగి ఉల్లి పాయ స్లయిస్ ని నిమ్మ చెక్కల్ని కూడా వేయించుకుని తూలు కుంటూ నిలబడ్డాడు. 
బిల్లు సెటిల్ చేసి వాళ్ళు వెళ్ళి పోయాక మేమూ ముగించాము. 
..
తిరిగి రోడ్డు మీదకి వచ్చి ఒక ఇరానీ చాయ్ తాగి బండి మీద చీరాల బయలు దేరాము. ..
టైమ్ రాత్రి 11.15 అయ్యింది. 
చీరాల స్టేషన్ లో ఒంగోలు వెళ్ళి సర్కార్ రైలు దొరుకుతుందా లేదా అనుకుంటూ ...
..
తీరా బాపట్ల దాటబోతుంటే ఆ హోటల్ లోని మొద్దు బాబు మళ్ళీ కనిపించాడు తులుకుంటూ 
ఎవరో పేమెంట్ మీద నిద్ర పోయేవాళ్లని లేపి తాను హిందూస్థాన్ నుండి తెచ్చిన కవర్లు వాళ్ళకి ఇస్తున్నాడు.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...