Monday, 13 February 2017

ఆరోహణం

ఉడుకు రక్తం.. 
ప్రపంచం ఎటు చూసినా మోసం, దగా.. 
ప్రపంచంలో చెడును చూసి రగిలిపోయేవాడు.
అతను బగవంతుని వేడుకున్నాడు “ ఈ ప్రపంచాన్ని మార్చు స్వామి. వీళ్ళని సన్మార్గం లో ప్రయాణం చేసెట్టు చూడు.”
**
నడి వయసు వచ్చింది.
సమాజం అలాగే ఉంది.
దాన్ని మార్చలేనని అతనికి అర్థమైపోయింది
“స్వామి .. ప్రపంచం సంగతి పక్కన పెట్టు. నా కుటుంబానికి బుద్ది నివ్వు.. వీళ్ళు నా మాట లక్ష పెట్టటం లేదు”
**
నడివయస్సు కాస్తా ముసలితనంగా మారింది.
జుత్తు తెల్లబడింది. చూపు మసకబారింది. ముఖంపై ముడుతలు వయస్సు లెక్కలు వేసీ వేసీ పలకమీద పసివాడి బలపం గీతల్లా కనిపించసాగాయి.
ఊరు పొమ్మంటోంది. కాడు రమ్మంటోంది.
అప్పుడు అతను దేవుడిని ఇలా ప్రార్థించాడు.
"స్వామీ... ప్రపంచాన్ని మార్చడం కాదు. నా వాళ్లను మార్చడం కాదు. ప్రభూ... ముందు నన్నుమార్చు....అందరిలో మంచినే చూసేవాడిలా నన్ను మార్చు స్వామీ"

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...