Friday, 10 February 2017

నేను కాదు.

డాక్టరు గారూ కట్టు విప్పెస్తారా? 
అయిదోసారి అడుగుతున్న పెద్దాయనని విసుక్కోకుండా 
“విప్పేస్తాను. విప్పి చిన్న ప్లాస్టర్ వేసి పంపుతాను. మరో పావుగంట కూర్చోండి” అన్నాడాయన మరో రోగిని పరీక్ష చేస్తూ...
“తొమ్మిది లోపు నేను ఇంటికి చేరాలి” మళ్ళీ అన్నాడాయన. 
“అర్జెంటు పనా? “ డాక్టర్ మందహాసం.
“లేదు నేను మా ఆవిడ తో కలిసి టిఫిన్ చేయాలి.”
“లేటయితే కోప్పడుతుందా?” మళ్ళీ అడిగాడు డాక్టర్.
‘చొట్ట బుగ్గలు కదిలిస్తూ నవ్వాడతాను.
“కోప్పడటమా ? పాడా? ఆవిడ నిద్రపోతుంది. ఏమి తినకుండానే? తనకి అల్జీమర్స్”
డాక్టర్ అభావంగా ఉండి పోయాడు.
“నిజానికి ఆమె నన్ను గుర్తు పట్టదు. రెండున్నర సంవత్సరాలయింది. నేనెవరో ఆమె గుర్తు పట్టి”
 కళ్ళు చెలమలవటం మొదలయింది. డాక్టర్ నిర్ఘాంతపోయాడు
డాక్టర్ కి చప్పున తానెంత కాజువల్ గా మాట్లాడనో అర్ధం అయింది.
“ మరికనేం.. మీరు ఆలస్యంగా వెళ్ళినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు” అన్నాడు ఆయన్ని ఊరడిస్తు..
‘ ఆమె మెదడు పని చేయదు. జ్నాపకాలు తుడిచేసిన పలక ఆమె. మంచానికే పరిమితం. ఎవరిని గుర్తు పట్టలేదు”
“ మరి మిమ్మల్ని గుర్తు పట్టనప్పుడు మీరు వెళ్ళి ఏమిటి లాభం?” వారిద్దరి సంభాషణ వింటున్న మూడో వ్యక్తి అడిగాడు.
“ఆమె నన్ను మరిచి పోయింది. నేను కాదు గా. “
 కట్టు విప్పుతుంటే డాక్టర్ చేతులు కంపించాయి 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...