Thursday 9 February 2017

బుధవారం ఎప్పటికీ రాదు

‘ఎవరో ఇరవైవేలు విరాళానిక్ రశీదు కావాలని’ అడిగారని ఓబులురెడ్డి మాస్టారు (మా అభయంజనేయస్వామి వారి దేవాలయం ట్రెజరర్) చెబితే.. నేను నవ్వి ఊరుకున్నాను. 
 ఎనబై అయిదు వేల లోటు బడ్జెట్ లో ఉంది దేవాలయం ఆర్ధిక స్థితి. 
“సార్ ఎండాకాలం కూలింగ్ నీళ్ళు తాగినట్టు లేదూ?” అన్నాడాయన ఫోన్ లోనే 
“మాస్టారూ.. అవి మరీచికలు. అనట్టు.. 20 వేలు విరాళం ఇస్తానన్నారా? రశీదు అడిగారా?”
“రెండు ఒకటే కదా?”
“కాదు మాస్టారు. మన గుడి కి 80 సి (పన్ను రాయితీ) ఉందనుకుని ఉంటాడు. 20 వేలు రశీదు కి మూడు ముప్పావాలా మీకు ఇస్తాడు. ఆయన ఐ‌టి రిటర్న్స్ లో 20000 ఛారిటీ చూయించుకుంటాడు. మీరు సరిగా చెప్పండి. అడగండి.”
“ఇంతుందా? అలా అనిపించలేదు సార్. సాయంత్రం పులిహోర ప్రసాదం తీసుకెళ్లి కలుస్తాను.”
“శుభం. ఎందుకయినా మంచిది రెండో మూడో ఉడికిన పచ్చి మిర్చి ఉండేటట్టు జాగర్త పడండి.”
...
రాత్రి తొమ్మిదికి గుడి వద్ద కలిశాం.
“మాకు 80C లేదని చెప్పాను. పులిహోర ఇచ్చాను. బుదవారం ఫోన్ చేస్తానన్నాడు”
“ఆ బుదవారం ఎప్పటికీ రాదు కానీ మనం యధావిధి గా సామాన్యుల సాయం తీసుకుందాం”
ఇద్దరం నవ్వుకున్నాం.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...