నిప్పు కణకణ మండుతోంది.....
మంటల నాల్కలు మింటికంటుతున్నాయి.
కనిపించిన చెట్టు, పుట్టా, పురుగూ పుట్రా అన్నిటినీ స్వాహా చేసేస్తోంది.
అడవి తగలబడుతోంది.
మంటల నాల్కలు మింటికంటుతున్నాయి.
కనిపించిన చెట్టు, పుట్టా, పురుగూ పుట్రా అన్నిటినీ స్వాహా చేసేస్తోంది.
అడవి తగలబడుతోంది.
వాళ్లూ వీళ్లూ నీళ్లు తెచ్చి మంటలనార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాసింత దూరంలో ఓ కాకి కూర్చుని ఈ తతంగమంతా చూస్తోంది.
ఇంతలో ఓ చిన్న పిట్ట రివ్వున ఎగిరి వచ్చింది. తన ముక్కుతో ఓ బొట్టు నీటిని తెచ్చి మంటలపై పోసింది. మళ్లీ అంతే వేగంగా వెళ్లింది. మరో బొట్టు నీటిని తెచ్చి నిప్పులపై చల్లింది. మళ్లీ వెళ్లింది..

కాకి ఈ తంతును చూసింది. ఆ బొట్టు నీరు ఈ మంటలను ఆర్పుతుందా?
ఎందుకీ వృధా ప్రయత్నం?
ఆవేశంగా వెళ్తున్న పిట్టను ఆపింది.
ఎందుకీ వృధా ప్రయత్నం?
ఆవేశంగా వెళ్తున్న పిట్టను ఆపింది.
"నీ చుక్క నీరుతో మంటలు ఆరిపోతాయానుకుంటున్నావా?"
పక్షి ముక్కున కరుచుకున్న నీటిని మంటలపై వేసి తిరిగి వచ్చింది. కాకి వైపు చూసింది.
"లేదు. నా చుక్క నీటితో ఈ మంటలు ఆగవు."
పక్షి ముక్కున కరుచుకున్న నీటిని మంటలపై వేసి తిరిగి వచ్చింది. కాకి వైపు చూసింది.
"లేదు. నా చుక్క నీటితో ఈ మంటలు ఆగవు."
"మరెందుకు ఈ ఆయాస ప్రయాసలు?"
"రేపు ఈ నిప్పు ఆరినా, పాకినా దీని గురించి ప్రజలు చర్చించుకుంటారు. అప్పుడు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన వారిలో నా పేరుంటుంది. అడవి అగ్గికి బుగ్గి అవుతుంటే తమాషా చూసిన వారిలో నీ పేరుంటుంది. చేతులు కట్టుకుని ఏమీ చేయకుండా కూర్చునే వారి జాబితాలో కాక నా పేరు ప్రయత్నించి విఫలమైన వారిలోనైనా ఉండాలన్నదే నా ప్రయత్నం."
పక్షి రివ్వున ఎగిరి పోయింది.
No comments:
Post a Comment