Saturday, 18 February 2017

నా చేతి లోనే ఉంది

పదమూడేళ్ళ ఒక కుర్రవాడి కి ఒక అనుమానం వచ్చింది. 
పెద్దవాడినయ్యాక నేను ఏమి అవుతాను? అని..
అద్దం లో చూసుకుంటున్నప్పుడు అతనికా అనుమానం వచ్చింది. తను పొట్టిగా లావుగా ముఖం స్ఫోటకం మచ్చలతో.. ఒకింత వికారంగా.. కనిపించాడు. 
తెల్లవార్లూ ఆలోచిస్తూనే ఉన్నాడు. తన మిత్రులని అడిగాడు. కొందరు గేలి చేశారు. ఆట పట్టించారు కానీ అతనికి ఏ సమాదానము రుచించలేదు. మర్నాటి ఉదయానికి అతని సమస్యకి ఒక పరిష్కారం దొరికింది. 
‘జ్యో తి ష్యు డు’ అవును జోతి ష్యు డు. 
అతను వెంటనే పేరుమోసిన జోతి ష్యుని కలిశాడు.
నుడిటికి, చెవులకి, ఛాతికి, జబ్బలకి ఎక్కడా ఖాళీ లేకుండా విభూతి నామాలు పెట్టుకుని లావుపాటి పుస్తకాలు బూతద్దము లాటి సరంజామాతో గమత్తుగా ఉన్నాడాయన.
పిల్లాడి ప్రశ్న ని విని కొంత ఆశ్చర్య పోయాడు. తర్వాత నవ్వాడు. ఆ తర్వాత ‘చేతిని చూపించు’ అన్నాడు. పిల్లాడు చెయ్యి చాచాడు.
ఈ సారి ఆయన మరింత ఆశ్చర్యపోయాడు. పిల్లాడి చేయి లో ఆయనకి కావలసిన గీతలు లేవు. బూతద్దం వాడి రెండు చేతులు పరిశీలనగా చూశాడు. రెండు అలానే స్వచ్చంగా ఉన్నాయి. “నువ్వేం కావు .. పో “ అన్నాడు.
ఆ పిల్లాడికి ఏమి అర్ధం కాలేదు. ఏడుస్తూ వెనుతిరిగాడు. ఇల్లు చేరేటప్పటికి ఆ దుఖం ఉదృతమయింది. బోరున ఏడిచాడు. ఓదార్చడానికి అతనికి ఎవరు లేరు. దుఖం లో ఉన్నవాడికి ఓదార్పు లేకపోవటం మరింత వేదనని మిగులుస్తుంది.
***
నాలుగు రోజుల తర్వాత ఆ పిల్లాడు మళ్ళీ ఆ జ్యోతిష్యుడిని కలిశాడు.
ఈ సారి అతని అర చేతుల్లో గీతలున్నాయి.
 పదునయిన కత్తితో గీసిన గీతలు అవి.
“ఇప్పుడు చెబుతాను “ అన్నాడాయన చేతి లోకి అద్దం తీసుకుంటూ..
ఆశ్చర్యంగా అతను చేతిని వెనక్కి లాక్కున్నాడు.
స్థిరంగా, స్పష్టంగా ఒక మాట చెప్పాడు.
“నాకు జీవిత సత్యం బోదపడింది. నేనేం అవాలని అనుకుంటున్నానో అది మరెక్కడో లేదు. నా చేతి లోనే ఉంది.”
<3 <3 <3
(నేను విధ్యార్డులని ఉద్దేశించి ప్రసంగించినపుడు తరచు గా చెప్పే కధ ఇది. ఈ రోజు ఒక స్కూల్ లో డ్రమేటిక్ గా చెప్పినప్పుడు పిల్లల చప్పట్ల తో పాటు ఒక ఉపాద్యాయుడు దగ్గరకి వచ్చి హత్తుకున్నాడు) 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...