Friday, 3 February 2017

స్పిరిట్ - చ్యువల్


మొబైల్ మత వాహనాలు ఊరూరా తిరగసాగాయి. 
మా వీదిలో కి తెల్లటి వాహనం ఒకటి వచ్చి చేరింది. దేవ దూతల్లాటి తెల్లటి గౌనుల్లో మహిళలు..పొడవాటి నల్లటి గౌనులో ఒక పెద్దాయన దిగారు. 
దాసు ఇంటి తలుపు తట్టారు. 
“ని జీవితం ఇప్పటికే చాలా వ్యర్ధం అయింది. ఇక నయినా ముక్తి మార్గం లోకి నడవటం మంచిది.” అన్నారు.
దాసు జలీల్ ఖాన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ముఖం పెట్టాడు.
“నేనేం చెయ్యాలి స్వామి?” అన్నాడు. పక్కగదిలో నుండి వచ్చిన ప్రామ్టింగ్ అందుకుంటూ..
“నీకు మత బోధ చేస్తాం నాయనా.. ని కుటుంబాన్ని ఒడ్డుకు చేరుస్తాం. నీ కష్టాలని తొలిగించే మార్గం చెబుతాం”
“వింటుంటేనే చాలా బాగుంది. తెచ్చిన వాటిని ఇంట్లో ఉంచండి. మేం సర్దుకుంటాం “
“మూర్ఖుడా.. మేము తెచ్చింది జ్ణనాన్ని.. ఇవ్వబోయేది మోక్షాన్ని”
“ఎందుకయినా మంచిది.. అర్ధమయ్యే భాషలో చెప్పండి స్వామి”
“స్పిరిచ్యువల్ గా నిన్ను సంసిద్దం చేస్తారు గురువుగారు.” పక్క నున్న శిష్యురాళ్ళు వివరించారు.
“ఇప్పుడు అర్ధమయింది. నేను ఆల్రెడీ సిద్దం గానే ఉన్నాను, మూడు బీరు సీసాలు, రెండు చీపు లిక్కరు బాటిల్లు సిద్దంగా ఉన్నాయి. మా అమ్మి టచ్చింగ్ కి ఆమ్లెట్ వేస్తుంది” అన్నాడు దేవదాసు.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...