Thursday, 31 March 2016

వెంటబడుతున్న కంపెనీలు

బాగా అవసరం అయిన ప్రాజెక్ట్ సగం లో ఉండగా బాస్ ని కలిశాడు వెంకటేశం.
..
"
సార్ .. నా సాలరి పాకేజీ విషయం మరో సారి " నసిగాడు...
..
"
మిస్టర్ వెంకటేశం యు నో వి ఆర్ నాట్ ఇన్ ఆ గుడ్ పొజిషన్, నార్ కొంఫర్టబుల్ స్టేట్. అంతా సౌకర్యంగా ఉన్నాక మీ పాకేజ్ పెంచుదాము. పదండి పని చూడండి. మండే కల్లా క్లైంట్స్ కి బెటా వెర్షన్ పంపించాలి".. బాసుడి ఓదార్పు
...
"
సర్ .. నాలుగు కంపనీలు నా వెంట పడుతున్నాయి. వాటికి సమాదానం మండే లోపు నేను చెప్పాలి" వజ్రాయుధం తీశాడు.
***...
%$&#&@
%&#@
&#!|}/\--
"సరే 10% హైక్ తీసుకోండి"...
...
"
కనీసం 30% అనుకున్నాను."...
...
"
కష్టం .. ఒకే మేక్ ఇట్ 15. ఇట్స్ ఫైనల్."
..
"
సరే సర్. నెక్స్ట్ ప్రాజెక్క్ కి మళ్ళీ కన్సిడర్ చేయండి "
***
"
నాలుగు కంపెనీ లు అన్నారు అవి ఏమిటో తెలుసు కోవచ్చా"
**
"
ఓహ్ నిక్షేపంగా సార్, కార్ లోన్ కంపెనీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ , క్రెడిట్ కార్డు కంపెనీ , ..


Sunday, 27 March 2016

నాగరికత అంటే సుఖంగా తిని తిరగటమా?

నీటిని ఎంత సమర్దవంతంగా వాడుకోవచ్చో మనం, కేవలం 700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం 55 లక్షల జనాబా ఉండే సింగపూరు నుండి నేర్చుకోవచ్చు. మలేషియా నుండి ఒప్పందం ప్రకారం 'జోహర్' నది నుండి వచ్చే అరా కోరా నీరే దాని ప్రధాన వనరు (2061 తో ఒప్పందం ముగుస్తుందట). భూమి మీద పడ్డ మూడింట రెండు వంతుల నీటిని రిజర్వాయిర్లకు మళ్ళిస్తుంది.
..
మురుగు నీటిని శుద్ది చేసి' newater' పేరుతో తిరిగి వినియోగిస్తున్నారు. దీని వాటా ప్రస్తుతం 10 శాతం నుండి 30 శాతానికి పెంచే ప్రయత్నం లో ఉన్నారు. సముద్ర జలాల నుండి కొంత మంచి నీటిని తయారు చేస్తున్నా దాని ఖర్చు ఎక్కువ. ప్రపంచ దేశాలకి ‘జలం మూలం ఇదం జగత్’ అనే పాఠాన్ని ఎప్పటి నుండో నేర్పే ప్రయత్నం చేస్తుంది. సింగపూర్ కి గ్లోబల్ హైడ్రో హబ్ గా పేరు ఉంది...
..
మనం, మన ప్రబుత్వాలు, మీడియా, సమాజాన్ని ప్రభావితం చెయ్యగల బాబాలు, మేదావులు, సినీ హీరోలు వ్యర్ధమయిన కూల్ డ్రింకుల తాగటం గురించి, పెళ్లి కి ముందు సంభందాలు లాటి చెత్త మాటలు మానేసి బాద్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది...
..
ప్రధానంగా మనం ఎదుర్కుంటున్న సమస్య ‘నీరు’
..
నీటికి కరువు ఎంత ఎక్కువగా ఉంది అని చెప్పడం లో మీడియా ఎప్పుడూ ముందే ఉంది. ఇప్పుడు సమస్య ఎవడి బూతద్దం పెద్దది అనేది కాదు. ..
సమస్యకి సోల్యూషన్ / జాగర్తలు /ముందుచూపు అవసరం . ఇప్పటికే మనం మన తర్వాత తరాల వారి నీటిని వాడుకుంటున్నాము. చిత్తు కాగితాలు వాళ్ళకి మిగిల్చే ఆరాటం లో ఉన్నాం .
నిజానికి వారికి మనం ఇవ్వ వలసింది వనరులు అది ప్రధానంగా మంచి గాలి/ నీరు .
..
మన రోజు వారి పనుల్లో / జీవితం లో నీటిని ఎంత తక్కువ ఖర్చు చేశాం? ..
ఎంత పొదుపు చేశాం? అనే రెండు రెండు అంశాల ను సదా గుర్తుంచు కోవాలి.
దాహం అయ్యాక భావి తవ్వటం అనే నానుడి మనకి అందరికీ తెలుసు.
ఇప్పుడు తవ్వుదామన్నా లోతు అనంతం. ..కన్నీళ్ళూ తప్ప నీటి చుక్క కనబడకపోవచ్చు frown emoticon
..
మనం మన పిల్లలకి కేవలం డబ్బు/భూమి/నగలు / చదువు ఇస్తే చాలా? మరేమీ అక్కర్లేదా? ఒక్క నిమిషం సీరియస్ గా ఆలోచించండి.
ఇంకుడు గుంతలనీ, కంటూర్ తవ్వకాలని కేవలం డబ్బు పిండుకోటానికి వాడుకున్నాం అప్పట్లో....అలా కాకుండా సమర్ధవంతంగా చిత్తశుద్దితో చేసినట్లయితే పరిస్తితి ఇంత దారుణంగా ఉండక పోవచ్చు.
..
ఇప్పుడు పొలాల్లో నీటి నిలవ సామర్ధ్యం పెంచుకోటానికి గుంటలు తీసుకోమని, వాటికి నగదు సాయం చేస్తామని ప్రభుత్వం ముందు కొచ్చింది. ప్రతి విషయాన్ని నెగెటివే గా ఆలో చించడం మానేయ్యాలి. ..
..
ఉన్న కొద్ది స్థలం లో గ్రౌండ్ ఫ్లోర్ లో భూభాగం (un floored) ఎక్కువ ఉండేట్టు చూసుకోండి. పార్కింగ్ టైల్స్ లాటి వాటితో కప్పెట్టి నీటి ఇంకుడు కి అవకాశం లేకుండా చేయకండి. ప్రతి బోర్ పాయింట్ వద్ద/ చుట్టూ నీటి ఇంకుడు ఏర్పాట్లు చేసుకోండీ...
...
వాడుక నీటిని, ఇంకుడు గుంటల్లోకి లేదా చెట్ల పాదికీ వెళ్ళే ఏర్పాటు చేసుకోండీ. పల్లెల్లో చాలామంది పిల్లలకి నులక మంచం మీద స్నానాలు చేయించి కింద పెట్టిన మరో పాత్రలో వాటిని పట్టి మళ్ళీ మరో అవసరానికి వినియోగిస్తున్నారు.
....
వాళ్ళ కి ఉండే కామన్ సెన్స్ మనకి ఉండటం లేదు.
నాగరికత అంటే మనం సుఖంగా తిని తిరగటం కాక పోవచ్చు.
మన జాతికి సమాదానం చెప్పాల్సిన బాద్యత మనందరికీ ఉంది.
...
ఈ రోజు మనం నీటి వృదాని ఎంత తగ్గించాము? ...
రేపటి కోసం ఏమి చేస్తున్నాము అని రోజు మనన్ని మనం ప్రశ్నించుకుందాం 






Saturday, 26 March 2016

మన పాత్ర ఎంత??

ఒక లోకల్ ట్రైన్ లో ప్రయాణించే మహిళ మీదకి తూలిన ఒక 50 ఏండ్ల పోలీస్ అదికారినుండి ఆమె చాకచక్యంగా తప్పించుకుంది. అతను వెనక్కి తూలి పడి లేవలేక పోయాడు.
..       
ఆ మధ్య నెట్ లో 'షరాబి పోలీస్' పేరిట హల్చల్ చేసిన కొద్ది క్షణాల నిడివి ఉన్న వీడియో అది.
..
అతని సంజాయిషీ కొరటం, అది రాక ముందే సస్పెన్షన్ వెంటనే జరిగిపోయాయి.
...
జీవితం లో మత్తు పదార్ధాలు వాడని అతనికి సేరిబ్రల్ హెమరేజ్ (మెదడు కి రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలు పగిలిపోవటం) పార్షియల్ పరాలసిస్ హటాత్తుగా ఎందుకొచ్చిందో అతని కుటుంబం తో పాటు డాక్టర్స్ కి అంతు పట్టలేదు. ట్రైన్ లో తల తిరిగి బాదతో అల్లాడిపోతూ ఏ ఆధారం దొరక్క వెనక్కి పడి పోయినప్పుడు తలకి అయిన గాయం ఆర్నెళ్ళ పాటు అతన్ని బాదించింది.
అంతకన్నా ముఖ్యంగా సోషల్ నెట్ వర్క్ లో తాగుబోతుగా హల్చల్ చేసిన వీడియో క్లిప్.
...
నిజం మందంగా ప్రయాణిస్తుంది కాబట్టి అతడికి లేటుగా న్యాయం జరగొచ్చు జరగక పోవచ్చు అది వేరే విషయం.
క్షణాల్లో జడ్జిమెంట్ ఇచ్చేయటం, మాటలతో కుళ్లబోడవటం మాత్రం మనందరికీ చాతనయింది. సోషియల్ మీడియా పాత్ర కూడా చాలా సార్లు సమాజానికి అంతులేని ప్రమాదం . :(
ఇందులో మన పాత్ర ఎంత??


అంగ వస్త్రం

ఒక వేసవి మధ్యాహ్నం మేము  ఆరుగురం ఒక మంచి రెస్టారెంట్ కి చేరాం. పాత పరిచయం ఉన్న మేనేజర్ తో కొంచెం ఎక్కువ సేపు కూర్చుంటాము అని ముందుగానే చెప్పి ఒక ఏసీ రూములో కూర్చున్నాము, అపోలో ఫిష్ స్టార్టర్ తో మొదలెట్టాము .. కిర దోస, కారేట్ ముక్కలు, మీద నిమ్మకాయ పిండుకుని రుచి చూస్తూ ప్రపంచం మీద పడ్డాం.
..
అంగవస్త్రం టాపిక్ అందుకుంది.
FB లో ఒకావిడ బార్య ముట్టు గుడ్డ ని బర్త పిండాలని తద్వారా చాలా ??వస్తాయని వ్యంగ్యం కూడా రాసింది. మేము రెండు వర్గాలు గా మారి వాదనలు చేసుకోటం మొదలెట్టామ్. ..

..
ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తూ ఉంది. తింటూనే ఉన్నాం.
కొద్ది సంవత్సరాలు గా కొన్ని వందల గంటల పాటు ప్రవచనాలు పురాణాలు పండిత పామరులకూ బోదిస్తూ, స్తల పురాణాలని, మనిషి జీవన విదానం లో మంచి చెడులని తన కోణం లో చెబుతూ వస్తున్న పెద్ద మనిషి నిమిషం పాటు మాట్లాడిని అంగవస్త్రం స్టేట్మెంట్ తప్పుఅని అంగవస్త్రం ఎవరు పిండాలో చెప్పినాయన పబ్లిక్ గా క్షమాపణ చెప్పాలి అంటూ ఒకాయన పట్టు పట్టాడు. ..
..
అప్పటికే కూర్చుని రెండు గంటలయింది.
వైటర్ ని పిలిచి, మొదట్లో తెచ్చిన అపోలో ఫిష్ మరో ప్లేటు చెప్పాడు.
మొదటి ముక్క లోనే చిన్న ముల్లు తగిలింది. రెస్టారెంట్ మీద చీటింగ్ కేసు పెట్టాలని మిత్రుడు తమాషా చేశాడు. ..
..
ఏకనామిక్స్ లో ‘law of diminishing marginal utility’ అని ఒక టుంది. వినియోగం ఎక్కువయ్యేకోంది. వస్తువు కి డిమాండ్/క్వాలిటీ తగ్గుతుంది. 
బాలాజీ లడ్డులో ఏదో పొరపాటు జరిగి ఒక బోల్ట్ రావచ్చు, అయ్యప్ప ప్రసాదం లో బీడీ ముక్క రావచ్చు. పొరపాటు సరిదిద్దుకోవాలి కానీ మొత్తాన్ని తప్పుపట్టటం సరి కాదని ఎదురు వర్గం దాడికి దిగింది. 
గతకాలపు ప్లేగు రోజులా? ఎలుక దూరిందని ఇల్లు మొత్తం తగలెట్టు కోటానికి.??..
..
ఇది సమర్ధన కాక పోవచ్చు. 
సుమారు వెయ్యి కోట్ల టార్గెట్ ఈ యాడాది కి ఎక్ష్సిజ్ వాళ్ళు ఎక్కువ వసూలు చేయాలని బడ్జెట్ లో ప్రతిపాదించడం తప్పు కాదు. రోడ్డున పోయేవాడిని కిడ్నాప్ చేసి తాపిస్తే తప్ప సాద్యపడదు ..!!
..
పెట్రోలు, డీజిలు రేట్లు ఎందుకు గోడకి కొట్టిన మేకుల్లా అక్కడే ఉన్నాయో అర్ధం అవదు. 
నెట్ లో వచ్చే నానా చెత్త నుండి పిల్లల్ని ఎలా కాపాడు కోవాలో తెలీదు.??
ఎవడు ఏరోజు ఏపార్టీ లో ఉంటాడో, అసలు లింగ మార్పిడి ఎందుకో, దాని పరమార్ధం ఏమిటో అర్ధం కాదు. అసలు రాష్ట్ర విబజన ఎందుకు చేశారో అసలే అర్ధం కాదు. ???
..
అనేక అయోమయం ప్రశ్నల మధ్య
ఇక బయలు దేరుదామా?” అన్నాను. టైమ్ 4.30 దాటింది...
..
బద్దకంగా ఉంది వేడి వేడి గా ఒక టి తో ముగిద్దామా?? అన్నాడు మరో మిత్రుడు...
..
బద్దకం వదలటానికే అయితే టి అక్కర్లేదు. బిల్లు వస్తుంది” ..

Friday, 25 March 2016

టైరు కింద న్యూస్ పేపర్

నీ సుపుత్రుడు రాత్రి పార్టీ నుండి ఎన్నిగంటలకి వచ్చాడు?
..
సెకండ్ షో వదిలే టైం కే వచ్చి పడుకున్నాడండి.
..
ఓహో .. ఆలానా?? వెళ్లి వాడి బైక్ టైరు కింద న్యూస్ పేపర్ ఉంది తీసుకురా

బుల్లెట్

బులెట్ బండి అమ్మటానికి వెళ్ళాడా కుర్రాడు.
..
"బండి బాగుంది ఎందుకని అమ్ముతున్నారు."
..
"నా గర్ల్ ఫ్రెండ్ మాట్లాడేది వినబడటం లేదు."
....
After one year.
....
హొండా యాక్టివా అమ్మకానికి తెచ్చాడు అతనే మళ్ళీ..
..
"బాగున్నారా?? " ఇతని పలకరింపు.
..
"ఆహా. పెళ్లికూడా చేసుకున్నాను "
...
"ఇలావచ్చారు.??"
..
"సై లెన్సర్ లేని బులెట్ ఏదయినా ఎక్సచేంజ్ లో దొరుకుతుందా???"

Thursday, 24 March 2016

హోలీ వెళ్లింది


లాంగ్ జర్నీచెయ్యటం కోసం వేసవి కదా అని ఖరీదయినా ఏసీ బస్ ఎక్కుతాం.
బస్ లో చాలా మంది మగాళ్లు 'తీర్ధం' పుచ్చుకుని బస్ ఎక్కుతారు. వాళ్ళ అలవాటు వారిది. నానా నాన్ వెజ్ తింటారు. ముంత మసాలాలు తింటూ ఎక్కుతారు. కొంతమంది ముదుర్లు దమ్స్  అప్ బాటిల్లో తయారు చేసుకున్న ద్రవాలు, అల్లం పచ్చడి, మంచింగ్  పోట్లాలు బస్సులోనే కానిస్తుంటారు. నోరు తెరిస్తే మార్కెట్ గుర్తుకొస్తుంది. ఇక విచిత్రమయిన శబ్దాలతో గురకలు మొదలవుతాయి. పరీక్షలో కాపీ కొట్టినట్టు ఎవరో చుట్ట పీలుస్తుంటారు. ఆ గబ్బు బస్సులో మూసిన కిటికీల మధ్య గింగిరాలు తిరుగుతూ ఉంటుంది. రక రకాల ఆల్కాహాలు, తిండి పదార్ధాల చండాలపు వాసన కొనసాగుతూ ఉంటుంది.
అన్నీ మూసేసి 'ఏసీ' వేసి,
పౌరులు సమాజం లో ఎంతో బాద్యతగా ఉంటున్నారో ఒక విగ్గున్న వారసత్వపు హీరో, కూతురి కన్నా చిన్న వయసున్న పిల్ల పిర్ర మీద చరుస్తు చెప్పే సినిమా ఒకటి టి‌వి లో వస్తుంటుంది. బస్సు సిటీ దాటుతుంది.


నిద్ర పట్టి పట్టనట్టు ఉంటుంది. ఒక పెద్దావిడ కాళ్ళు వాఛి బాద పడుతుంటుంది. మొదటి సారి పుట్టింటికి వచ్చే గర్బిని పిల్ల అసౌకర్యంగా కదులుతూ ఉంటుంది. జర్నీ అలవాటు లేని ఒకావిడ అత్యంత బాదాకరంగా వాంతి ని ఆపుకోటానికి ప్రయత్నిస్తుంటుంది.


తెల్లవారుజామున అందాకా గురక పెట్టిన  పేగులు రెండో వైపు పని చేయటం మొదలవుతాయి. క్లోజ్డ్ బస్సులో ఆ గాలి గిరికిలు కొడుతుంది. ఎవరో వాంటింగ్ చేసుకుంటారు. అది 'ఎండి' పోవాల్సిందే గాని ఎప్పటికీ కడగని RTC బస్సు లో ప్రయాణం సురక్షితం అని టి‌వి లో ప్రకటన వేస్తుంటారు. కానీ ఎవూరు దగ్గర్లో ఉన్నామో  మాత్రం ఎవరూ చెప్పరు..


దిగి ప్రాణాలు కాపాడుకుని తర్వాత నడిచి వెళ్దామా అని పిస్తుంది. పక్కనే కూర్చున్న ఒక పెద్దావిడని, జర్నీ పడని ఒక పిల్ల అడుగుతుంది. "ఇది ఎవూరు ఆంటీ ?" అని.
రెండు కళ్ళు ముక్కుమీదకు తెచ్చి ఆవిడ అంటుంది

"హోలీ నిన్ననే అయిపోయింది గా"

Sunday, 20 March 2016

ఒక మొద్దు బాబు ని చూశాను


రాత్రి కర్లపాలెంలో పని చూసుకుని తిరిగి బయలు దేరేసరికి మా ఇద్దరికీ టైం  పది దాటింది.
10-30 కి బాపట్ల లో ఆ టైమ్ లో కూడా తిండి దొరికే హిందూస్థాన్ హోటల్ కి ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన సందులోకి వెళ్ళి బండి పార్క్ చేసి కూర్చున్నాము. 

..
చిన్న హోటల్ నాన్ వెజ్ కి ప్రసిద్ది. పుల్కాలు కాజు కర్రీ ఆర్డర్ చేశాం...
.. 
మా గ్లాస్ టేబుల్ ఎదురుగా ఒక తడి బాచ్ తులుతూనే, ..
నాన్ వెజ్ వంటకాలు కెలుకుతున్నారు. చంద్రబాబుకి రుణమాఫీ మీద ఒకరు ఉపన్యాసం, సలహాలు ఇస్తున్నాడు. 
హోటల్ యజమాని లౌక్యంగా వారి సంభాషణ వాల్యూమ్ ని తగ్గించే ఏర్పాటు చేస్తున్నాడు. 
..
మేం చాలదేమోనని చెప్పిన ఎగస్ట్రా టమోటా కర్రీ మిగిలి పోయిందని ..ఎగస్థ్రా పుల్కాలు చెప్పాం. 
తీరా అవి వచ్చాక, మార్చి ఆఖర్లో ఖర్చు పెట్టాల్సిన కేంద్ర నిదుల్లాగా 
బలవంతాన లోడ్ చేస్తున్నాం. 
..
ఈ లోగా ఎదురు టేబుల్ వాళ్ళ గెలుకుడు పూర్తి అయ్యింది. 
అందులో ఒక పొడవాటి, మొద్దు కుర్రాడు కౌంటర్ నుండి రెండు ప్లాస్టిక్ కవర్ తెప్పించుకుని, మిగిలిన బిర్యానీ అన్నాన్ని, మాంసం ముక్కల్ని వేరుగా చేసి అందులోకి మార్చాడు. అడిగి ఉల్లి పాయ స్లయిస్ ని నిమ్మ చెక్కల్ని కూడా వేయించుకుని తూలు కుంటూ నిలబడ్డాడు. 
బిల్లు సెటిల్ చేసి వాళ్ళు వెళ్ళి పోయాక మేమూ ముగించాము. 
..
తిరిగి రోడ్డు మీదకి వచ్చి ఒక ఇరానీ చాయ్ తాగి బండి మీద చీరాల బయలు దేరాము. ..
టైమ్ రాత్రి 11.15 అయ్యింది. 
చీరాల స్టేషన్ లో ఒంగోలు వెళ్ళి సర్కార్ రైలు దొరుకుతుందా లేదా అనుకుంటూ ...
..
తీరా బాపట్ల దాటబోతుంటే ఆ హోటల్ లోని మొద్దు బాబు మళ్ళీ కనిపించాడు తులుకుంటూ 
ఎవరో పేమెంట్ మీద నిద్ర పోయేవాళ్లని లేపి తాను హిందూస్థాన్ నుండి తెచ్చిన కవర్లు వాళ్ళకి ఇస్తున్నాడు.

Saturday, 19 March 2016

సీనియర్ సలహా

ఒక జూనియర్ ఇల్లాలు సీనియర్ ఇల్లాలు మార్కెట్ లో కలిశారు.
..
కొద్దిగా ఖరీదు చేసే డైమండ్ ఇయర్ రింగ్స్ తన బర్త చేత కొనిపించాలంటే ఏమిచెయ్యాలని సీనియర్ ని సలహా అడిగింది జూనియర్...
..
మగాడి మనసుకి దగ్గర మార్గం కడుపే. బాగా రుచిగా వండి పెట్టు. ..నువ్వు చెప్పిన మాట వింటాడు అందావిడ. అంతటితో ఆపకుండా రెండు మూడు అద్బుతమయిన రెసిపిలు చెప్పింది. దానికి కావల్సిన సరంజామా కొనుక్కుని ఆటో ఎక్కింది జూ . ఇల్లాలు.
**
వారం తర్వాత అదే మార్కెట్ లో తారసపడ్డ జూనియర్ ని సీనియర్ అడిగింది.
“ నే చెప్పినట్టు వండి పెట్టావా?”
“ఆహా” అంది జూనియర్.
“తర్వాత ?”
“ఏమండీ రోజు ఇలా వండి పెడితే నాకే మిస్తారు? అని కూడా అడిగాను” అభావంగా చెప్పింది జూనియర్.
“అపుడేమన్నాడు? మా మరిది?”
“నేనివ్వటం ఎందుకు? ఇన్సూరెన్స్ డబ్బులోస్తాయి. దాంతో ని ఇష్టం వచ్చింది కొనుక్కో మన్నాడు”



Thursday, 17 March 2016

ట్రావెలోగ్ ఆఫ్ కనకం.


చెన్నై నుండి పోర్ట్ బ్లైర్ డీలక్స్ కాబిన్ లో అండమాన్ వెళ్తున్న కనకం ఒక చిన్న బుక్ లో ట్రావెలాగ్ రాసుకుంది.
..
సోమవారం : 2nd క్లాస్ కేబిన్ లో అండమాన్ బయలు దేరాను. సముద్రం మీద మొదటి సారి ప్రయాణం మొదటి ఆరు గంటల పాటు కడుపు అంతా దేవి నట్లు ఉంది. వామిటింగ్ సెన్సేషన్. డెక్ మీద చాలా సేపు నుంచున్నాను. చాలా మంది లాగే నేను తరచూ వాష్ బేసిన్ వద్దకి పరిగెత్తడం ఒక పొడవాటి వ్యక్తి గమనించాడు. సముద్రపు గాలులు, ఊగే షిప్ మీద ఎలా నడవాలో, ఆహారం లో ఏమి జాగర్తలు తీసుకోవాలో వివరంగా చెప్పాడు. 40 ఏళ్ల వయసులో ఉన్నా చాలా దృడంగా ఉన్నాడతను కేబిన్ కి వస్తుంటే గ్లూకోజ్ వాటర్ ఇచ్చాడు. హొ నైస్ హి ఈజ్ ??
..
మంగళవారం: తమాషా గా ఉంది అతని పేరు 'దిలీప్' ఆట. ఆ షిప్ కి కెప్టెన్ ఆట. ఈ రోజు నన్ను షిప్ కేబిన్ లోకి ఆహ్వానించాడు. అక్కడ మెరైన్ యూనిట్, నాటికల్ వేగం గురించి, రాడార్ అనుసందానం గురించి చాలా విషయాలు చెప్పాడు. నన్నో ప్రముఖ వ్యక్తి లాగా ట్రీట్ చేశాడు. నన్ను డెక్ మీద అనేక భంగిమల్లో ఫోటో లు తీశాడు. సముద్రం నీరు మా కాళ్లని తాకాలని చేసే ప్రయత్నం చాలా బాగుంది.
..
బుదవారం: ఒక్క గంట సేపు సముద్రం లో లంగరు వేసినప్పుడు చుట్టూ నాటు పడవల్లో చేపల వెటకి వచ్చేవారికి డిజిల్, మంచి నీళ్ళు ఇచ్చి సాయం చేస్తే వాళ్ళు అత్యంత ఖరీదయిన లొబ్ స్టర్ రొయ్యలని వీళ్ళకి ఇస్తారట. దిలీప్ చెప్పాడు. ఈరోజు తనతో పాటు మొదటి సారిగా లొబ్ స్టర్రుచి చూశాను. తనతో ఉన్నంత సేపు అతను నన్నే గమనించడం చూశాను.
..
గురువారం: దిలీప్ పద్దతి ఏమి బాలేదు. నా అందాన్నిఅతిగా పొగడటం. దొంగ చాటుగా నన్ను చూడటం, తరచు చేతులు కలపటం ఊహూ.. ఏమంత మంచి వాడు కాదు.
..
శుక్రవారం: దుర్మార్గుడు ఇవాళ తనే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. తనతో పాటు ఒంటరిగా 'ఒక గంట' గడపాలట. లేకుంటే 3415 మంది ప్రయాణికులు ఉన్న షిప్ ని నడి సముద్రం లో ముంచేస్తానని బెదిరించాడు. వణికే కాళ్లతో నేను నా కేబిన్ కి ఎలా చేరానో గుర్తు లేదు . 
..
శనివారం: నేనివాళ అతని కంట పడకుండా తప్పించుకుందామని విఫల యత్నం చేశాను. 24 గంటల గడువు విదించాడు. లేదా 3415 మంది ప్రాణాలు .. హరి .
..
..
..
ఆదివారం: గంట అనుకున్నది మరో రెండు గంటల సమయం పట్టింది. నాకిప్పుడు తృప్తిగా ఉంది . 3415 మంది ప్రాణాలు కాపాడాను. 

Wednesday, 9 March 2016

పొగ సందేశం

ఒక బాధ్యత లేని మనిషి 

రింగులు రింగులు గా వదిలిన పోగ ప్రయాణించి ..
ప్రయాణించి ...
ప్రయాణించి ..
పొగ వదిలిన వ్యక్తి శరీరం నేలమీద పడి
రెండు బొటనవేళ్లు కట్టి ఉంచినప్పుడు 
అతని తల వద్ద వెలిగే దీపం 
పక్కనే సృహతప్పిన బార్య,
పాల బుగ్గలమీద నీటి చారికలు ఏండి పోయిన పిల్ల 
ఛౌక బియ్యం తో సగం నింపిన ప్లాస్టిక్ గ్లాస్ లో 


వెలిగించిన అగరు బత్తి ల
పొగలో కలిసి పోతుంది.

Monday, 7 March 2016

హాపీ ఉమెన్స్ డే

అతనికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది .
మొట్టమొదటి సారి తను ఉరేల్లింది.
ఏదో ప్రాపర్టీ తాలూకు గొడవల్లో మామగారికి తన సంతకం అవసరం అయ్యింది.
బబ్లూ ని వెంటబెట్టుకుని, రెండు రోజుల్లో వచ్చేస్తానని..
ఉద్యోగరీత్యా ఏలూరు లో ఉండటం మొదలెట్టాక ఇదే మొదటిసారి ఈ ఆరు సంవత్సరాలలో 
రెండు రోజులు .. పెళ్ళాం ఉరేలితే .. 
ఏమేం చెయ్యొచ్చు ?? ఫ్రెండ్స్ ? కార్డ్స్ ? మందు ? ఇవేమీ తనకు అలవాటు లేదు మరి అందరూ అనే ఈ స్వతంత్రం వాడుకోవటం ఎలా?
అతను ఇంటికొచ్చాడు. టైమ్ ఏడున్నర. ఫ్లాట్ తాళం వేసి ఉంది. వాలేట్ లో జాగర్తగా ఉంచుకున్న తాళం చెవి తీసి తలుపు తీశాడు. 
గదిలో సోఫా ముందు టీ పాయ్ మీద నిత్యం పడుకునే ముందు తను చదువుకునే పుస్తకం ఉంది. బెడ్ రూమ్ లో కి వెళ్ళి స్నానం చేశాడు. టవల్ కట్టుకుని పూజా మందిరం లోకి వెళ్ళి బొట్టు పెట్టుకుని అగరు బత్తీలు వెలిగించి నమస్కారం చేసుకున్నాడు.
కప్ బోర్డు తెరవగానే డోర్ లోపల వైపు అంటించి తనఫోటో ఉంది. 
హాని మూన్ వెళ్లినప్పుడు మున్నార్ బాక్ వాటర్స్ లో బోట్ లో స్వయంగా అతనే తీసిన ఫోటో అది. తనకి చాలా ఇష్టమయినది.
నైట్ డ్రస్ వేసుకుని వచ్చి హల్లో టి‌వి ఆన్ చేశాడు. పవర్ సప్లై పోవటం తను గమనించాడు. 
మిగిలిన అన్నీ రూముల్లో సప్లయ్ ఉంది. హల్లో ఉన్న మైన్ బోర్డు లో MCB ట్రిప్ అయి ఉంది దాన్ని సరిచేసే సరికి టి‌వి సప్లై వచ్చింది. పదినిమిషాలు టి‌వి చూసేసరికి ఫోన్ మోగింది.
తనే . మాస్టారు ఏం చేస్తున్నారు ?”
ఇప్పుడే వచ్చి స్నానం చేసి కూర్చుని టి‌వి చూస్తున్నాను
“mcb
ట్రిప్ అయి ఉందాలే? “ పక్కనే కూర్చుని చెప్పినట్లు చెప్పింది.
అవును ని కెలా ?” 
అదే మాజిక్ఒక్క నిమిషం కిచెన్ లోకి వెళ్ళండి.
అతను లేచి వెళ్ళేసరికి రైస్ కుక్కర్ వార్మ్ లో ఉంది. అవెన్ వార్మ్ మోడ్ లో ఉంది. తాను పవర్ సరిచేసినప్పుడు ఆన్ అయి ఉండాలి.
అవెన్ లో కూరలు వేడి అయి ఉంటాయి. రైస్ రెడీ అయి ఉంటుంది. ఫ్రీడ్జ్ లో పచ్చళ్లు, పెరుగు ఉన్నాయి. బోజనమ్ చేయండి. అంట్లు కడగటానికి పొద్దుటే పనమ్మాయి వస్తుంది
అతను ఏమి మాట్లాడలేదు. 
హలో సార్ ఏమి మాటల్లేవు
నువ్వేప్పుడు వస్తున్నావు?”
ఇవాళే సార్ నేను వచ్చింది. రేపు రిజిస్ట్రేషన్ పని అవోచ్చు. కానీ రేపు అమ్మ వాళ్ళు పంపక పోవచ్చు ఎల్లుండి వచ్చేస్తాను.తను పోను పెట్టేసింది. 
రాత్రి పదిన్నరకి అతను ఫోన్ చేశాడు.
ఆమె మొదటి రింగు కె అటెండయింది.
బబ్లూ ఏమి చేస్తున్నాడు.?”
వాళ్ళ అమ్మమ్మ తో ఇప్పటిదాకా ఆడి ఇప్పుడే నిద్రపోయాడు
బబ్లూ వాళ్ళ అమ్మ ఏమి చేస్తుంది?”
అటునుండి నవ్వు. 
ఇటు మౌనం .
అటు నుండి మళ్ళీ నవ్వు. 
మాధవి .. హాపీ ఉమెన్స్ డే. అండ్ xxx xxx xxx xxxx “
తెరలు తెరలుగా ఆమె నవ్వుతూనే ఉంది.



www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...