Saturday, 4 February 2017

డొడో

మారిషస్, న్యూజీలాండ్లలో వంద ఏళ్ల క్రితం ఒక పక్షి ఉండేది.
సుమారుగా మీటరు ఎత్తు 10 నుండి 21 కిలోల బరువు ఉండే దాని పేరు డోడో.
Dodo (Raphus cucullatus)
..
శత్రువులు కనిపించగానే అది చచ్చినట్టు పడి ఉండేది. శత్రువులు వదిలేసి వెళ్లిపోయేవి. చచ్చిన దాన్ని స్థానిక మావురీ, మారిషస్ ప్రజలు ముట్టుకునేవారు కాదు. అందుకే ‘డోడో’లు బతికిపోయేవి.
ఆ తరువాత ఆంగ్లేయులొచ్చారు. వాళ్ల తోలెంత తెలుపో మనసంత నలుపు.
వాళ్లు మావురీల్లాంటి వాళ్లు కాదు. డోడోల్ని చంపడం వాళ్లకి సరదా అయిపోయింది.
చచ్చిపడున్నట్టు పడుండే డోడోల్ని కాల్చి చంపే పిట్టల దొరలు వాళ్లు.
డోడోల వెర్రిబాగుల రక్షణ వ్యూహాన్ని చూసే "డెడ్ యాజ్ ఏ డోడో" అన్న ఆంగ్ల నానుడి పుట్టు కొచ్చింది.
అలా మొత్తం డోడోలను వరస పెట్టి చంపేశారు. చిట్టచివరి డోడో 1671 ప్రాంతంలో చనిపోయింది. తెల్లోళ్లు తీసిన ఫోటోలు, గీసిన బొమ్మలు తప్ప డోడోఅనే పక్షి ఉందన్న ఋజువులే లేకుండా పోయాయి.
..
అసలు కథ ఆ తరువాతే మొదలైంది.
..
డోడోలు చనిపోయిన ఒక వందా యాభై ఏళ్లకి శాస్త్రవేత్తలు ఒక విచిత్రాన్ని గమనించారు. కాల్వేరియా మేజర్ అనే చెట్టు విత్తనాలు మొలకెత్తడం మానేశాయి. పాత చెట్లను విచక్షణా రహితంగా నరికేశారు. అడవులను కాల్చేశారు. కొత్తవి మొలకెత్తడం లేదు. ఇప్పుడు ప్రపంచంలో 13 మాత్రమే మిగిలాయి. అవీ ముసలి చెట్లు. అన్నీ 300 ఏళ్లు దాటినవే. ఎంత ప్రయత్నించినా, ఎన్ని ప్రయోగాలు చేసినా విత్తనాలు మాత్రం మాట వినడం లేదు.
అప్పుడు అర్థమైంది సైంటిస్టులకి.
డోడోలకి కాల్వేరియా కాయలే ప్రధాన ఆహారం. డోడోల జీర్ణకోశం లోని ప్రత్యేక రసాయనాలకు కాల్వేరియా విత్తనాల పై పొర కరిగిపోయేది. దాని రెట్టనుంచి విత్తనాలు నేలపై పడిన మరుక్షణం మొలకెత్తేవి.
కాల్వేరియా విత్తనపు కంచు కవచం తాళం చెవి తన కడుపులోనే దాచుకుని డోడో అంతరించిపోయింది.
కాల్వేరియా జీవ బిందువు బయటికి రానుగాక రానంటూ విత్తనంలోపలే దాగుండిపోయింది.





..
సర్వనాశనం అయ్యాక సమాదులకి మోకరిల్లటం మానవాళి చేస్తున్న పనేగా?
..
దేశం ఏమిటి? ఉంటే ఎంత? పోతే ఎంత?
భారత్ కాకపోతే అమెరికా ...
అదీ కాకపోతే అంతరిక్షం....
దేశం అంటే డోడో లాంటి డెడ్ థింగే కదా అనుకుంటారు చాలా మంది.
పాపం వాళ్లకి తెలియదు...
వాళ్ళ లక్షాలు కాల్వేరియా మేజర్ లాంటి వాటివని.

No comments: