హాస్టల్
లో ఉన్న తమ్ముడి తో మా ఆమ్మాయి స్పీకర్ ఫోన్ లో మాట్లాడుతుంది.
“మొన్న
సండే వ్రాసిన appsc ఎక్సామ్ ఏమయిందక్కా?”
“రిజల్ట్స్
రాలేదురా?
కీ ఇచ్చారు. క్వాలిఫై దాటి మరో 30 మార్కులు వస్తాయి”
“మళ్ళీ ఎక్సామ్ ఉందా? “
“అవును
రౌండ్ టూ మెయిన్స్ ఉంటుంది. డిసెంబరు ఎండింగ్ లో “
“ సబ్జెక్టేనా ?
“ అవును..
GK కూడా ఉంటుంది.”
“ఇంకా
ఏం చదువుతావు లే అక్కా?”
“ రేయ్
స్పీకర్ ఆన్ చేసి ఉందిరా?”
“చెప్పవే..
అక్కా బాగా చదువు అక్కా యు కెన్ డూ ఇట్ ”.
“రేయ్
నాన్న కూడా పక్కనే ఉన్నారు. వింటున్నారు”
“రోజు న్యూస్ పేపర్ చూడు, రెండో పేజీ లో వ్యాసాలు
చదువు. ..”
“రేయ్
ఇంక చాలు గాని. పిచ్చోడిలా ఆ గడ్డం ఏమిటి క్రాఫ్ చేయించు కోలేదా?? ఫోటో చూశాను “
“అక్కా..
సిగ్నల్ బాలేదు . మళ్ళీ చెయ్యనా?”
No comments:
Post a Comment